ఆరెంజ్ క్యాప్ నమ్దే.. పర్పుల్ క్యాప్ నమ్దే.. ఈసాలా కప్ కొడతామంటూ పొంగిపోతున్న ఆర్సీబీ ఫ్యాన్స్

Published : Apr 20, 2023, 09:46 PM IST
ఆరెంజ్ క్యాప్ నమ్దే.. పర్పుల్ క్యాప్ నమ్దే.. ఈసాలా కప్ కొడతామంటూ పొంగిపోతున్న ఆర్సీబీ ఫ్యాన్స్

సారాంశం

IPL 2023 Points Table: ఐపీఎల్  లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులు ‘ఏదేమైనా ఈసాలా కప్ నమ్దే’ అంటూ  మళ్లీ హంగామా చేస్తున్నారు. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 ఎడిషన్‌లో  ఆరు మ్యాచ్ లు ఆడి మూడింట్లో గెలిచి మూడింట్లో ఓడిన  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)  ప్లేఆఫ్  దిశగా ముందుకు సాగుతోంది. ఐపీఎల్  మొదలైనప్పట్నుంచి  ఈ ఏడాది వరకూ   ప్రతీ ఏడాది ‘ఈసాలా కప్ నమ్దే’అంటూ నానా హంగామా చేసే అభిమానులు ఈసారి కాస్త ఎక్కువే రియాక్ట్ అవుతున్నారు.  దానికి కారణాలు లేకపోలేదు.  ఆ జట్టు ఆటగాళ్లు   ప్రదర్శనల పరంగా టాప్ గేర్ లో దూసుకుపోతున్నారు.  ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ఆటగాళ్లు ఆ జట్టులోనే ఉన్నారు.  

ఈ సీజన్ లో భాగంగా  నేడు మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్ తో ముగిసిన మ్యాచ్ లో   ఆర్సీబీ 24 పరుగుల తేడాతో నెగ్గింది.  అయితే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఆటగాళ్లు  తమ అత్యుత్తమ ప్రదర్శనలతో  అత్యధిక  పరుగులు, వికెట్లు సాధించిన వీరుల్లో టాప్  లో నిలిచారు.  

ఆరెంజ్ క్యాప్.. 

ఈ సీజన్ లో  ఆరు మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ దుమ్మురేపుతున్నాడు.   ఇప్పటికే 4 హాఫ్ సెంచరీలు చేసిన డుప్లెసిస్ ఆరు ఇన్నింగ్స్ లలో  68.60 సగటుతో  343 పరుగులు సాధించాడు.  ప్రస్తుతం అతడే ఆరెంజ్ క్యాప్ హోల్డర్. అతడి  తర్వాత రెండో స్థానంలో ఉన్న  విరాట్ కోహ్లీ (279)  కూడా  బెంగళూరు ఆటగాడే. ఈ జాబితాలో  జోస్ బట్లర్ (244), వెంకటేశ్ అయ్యర్ (234), శిఖర్ ధావన్ (233) లు  టాప్ -5లో ఉన్నారు.  

పర్పుల్ క్యాప్.. 

పంజాబ్ తో మ్యాచ్ లో నాలుగు వికెట్లు పడగొట్టడంతో సిరాజ్  పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు.  ఈ సీజన్ లో ఇప్పటిదాకా  ఆరు మ్యాచ్ లలో 12 వికెట్లు తీసిన సిరాజ్.. వికెట్లతో పాటు  ప్రత్యర్థులు పరుగులు చేయకుండా అడ్డుకుంటున్నాడు.  ఈ జాబితాలో మార్క్ వుడ్  (12), యుజ్వేంద్ర చాహల్ (11), రషీద్ ఖాన్ (11), మహ్మద్ షమీ (10) టాప్ -5లో ఉన్నారు. 

 

ఈ సాలా కప్ నమ్దే.. 

ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్  రెండూ ఆర్సీబీ ఉండటంతో  (ఇప్పటికైతే) ఈసారి కప్ కొట్టేది కూడా తామే అంటున్నారు ఆర్సీబీ అభిమానులు. అయితే ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ఉన్నంత మాత్రానా కప్ వస్తుందనుకుంటే పొరపాటే. గతేడాది రాజస్తాన్ రాయల్స్  లో జోస్ బట్లర్,  యుజ్వేంద్ర చాహల్ లు  ఈ  జాబితాలలో ముందున్నవారే.  సీజన్ లాస్ట్ దాకా  ఇదే మెయింటెన్ చేసినా చివరికి కప్ గుజరాత్ కొట్టింది. అదీగాక  ఆర్సీబీకి అసలే  దురద్రుష్టానికి బ్రాండ్ అంబాసిడర్. ఎప్పుడెలా ఆడుతుందో  తెలియని ఆ జట్టు   కప్ కొట్టడమంటే కాస్త ఆలోచించాల్సిందే అంటున్నారు ఇతర జట్ల అభిమానులు.

ఐపీఎల్ -16 పాయింట్ల పట్లిక : 

1. రాజస్తాన్ రాయల్స్ (ఆడినవి : 6, గెలుపు 4, ఓటమి 2) 
2. లక్నో సూపర్ జెయింట్స్ (ఆడినవి : 6, గెలుపు 4, ఓటమి 2)
3. చెన్నై సూపర్ కింగ్స్ (ఆడినవి : 5, గెలుపు 3, ఓటమి 2)
4. గుజరాత్ టైటాన్స్ (ఆడినవి : 5, గెలుపు 3, ఓటమి 2)
5. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆడినవి : 6, గెలుపు 3, ఓటమి 3)
6. ముంబై ఇండియన్స్ (ఆడినవి : 5, గెలుపు 3, ఓటమి 2)
7. పంజాబ్ కింగ్స్ (ఆడినవి : 6, గెలుపు 3, ఓటమి 3)
8. కోల్కతా నైట్ రైడర్స్ (ఆడినవి : 5, గెలుపు 2, ఓటమి 3)
9. సన్ రైజర్స్ హైదరాబాద్ (ఆడినవి : 5, గెలుపు 2, ఓటమి 3)
10. ఢిల్లీ క్యాపిటల్స్ (ఆడినవి : 5, గెలుపు 0, ఓటమి 5)

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే