IPL 2023, DC vs KKR: ఆగిన వాన.. ఢిల్లీ బోణీ కొట్టేనా..? కోల్‌కతా‌తో కీలక పోరులో టాస్ గెలిచిన వార్నర్

Published : Apr 20, 2023, 08:31 PM IST
IPL 2023, DC vs KKR: ఆగిన వాన.. ఢిల్లీ బోణీ కొట్టేనా..? కోల్‌కతా‌తో  కీలక పోరులో టాస్ గెలిచిన వార్నర్

సారాంశం

IPL 2023: ఢిల్లీ - కేకేఆర్ మ్యాచ్  లో టాస్ కు ముందు అంతరాయం కలగించిన వాన ఎట్టకేలకు తెరిపినిచ్చింది.    ఐపీఎల్ - 16లో వరుసగా ఐదు పరాజయాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్  నేడు  కోల్‌కతా నైట్ రైడర్స్ తో  కీలక మ్యాచ్ లో  తలపడనుంది.   

ఐపీఎల్ - 16 లో నేడు జరగాల్సి ఉన్న ఢిల్లీ  క్యాపిటల్స్ - కోల్‌కతా  నైట్ రైడర్స్  మ్యాచ్ కు ముందు అంతరాయం కలిగించిన వాన ఎట్టకేలకు ఆగింది. టాస్‌కు ముందు  వర్షం రావడంతో గంటన్నర ఆలస్యంగా మ్యాచ్  ప్రారంభమైంది. కాగా  ఈ మ్యాచ్ లో  టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ ఫీల్డింగ్ ను ఎంచుకుంది. నితీశ్ రాణా సారథ్యంలోని కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ కు రానుంది. ఇక వరుసగా ఐదు మ్యాచ్ లలో ఓడిన ఢిల్లీ..  ఈ మ్యాచ్ లో కూడా  ఓడితే ఇప్పటికే సంక్లిష్టంగా ఉన్న ఆ జట్టు ప్లేఆఫ్ ఆశలు దాదాపు అడుగంటినట్టే.. 

ఈ మ్యాచ్ లో   ఢిల్లీ, కేకేఆర్ జట్లు పలు మార్పులు చేశాయి. కేకేఆర్ గుర్బాజ్, జగదీశన్ ను పక్కనబెట్టి జేసన్ రాయ్, లిటన్ దాస్ లను తీసుకుంది. లాకీ ఫెర్గూసన్ కూడా  ఆడటం లేదు.  అతడి స్థానంలో కుల్వంత్ వచ్చాడు. ఇక ఢిల్లీలో కూడా వరుసగా విఫలమవుతున్న  పృథ్వీ షా కు ఈ మ్యాచ్ లో ఆడే అవకాశం దక్కలేదు.  అభిషేక్ పొరెల్, ముస్తాఫిజుర్ కూడా జట్టులో చోటు కోల్పోయారు. 

ఈ సీజన్ లో ఢిల్లీకి ఏదీ కలిసిరావడం లేదు. ఆడిన ఐదు మ్యాచ్ లలో ఆ జట్టు ఓటములతో పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో ఉంది. సొంత గ్రౌండ్ లో   గుజరాత్,  ముంబైల చేతులలో ఓడిన కేకేఆర్ పై అయినా గెలిచి   ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తున్నది.  

మరో వైపు కేకేఆర్ కూడా  ఆడిన ఐదు మ్యాచ్ లలో  రెండింటిలోనే గెలిచి మూడు మ్యాచ్ లు ఓడి  పాయింట్ల పట్టికలో   ఏడో స్థానంలో ఉంది.  నేటి  మ్యాచ్ లో గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని  కేకేఆర్ కోరుకుంటున్నది. 

 

తుది జట్లు :

కోల్కతా నైట్ రైడర్స్ : జేసన్ రాయ్, లిటన్ దాస్,   వెంకటేశ్ అయ్యర్, మన్‌దీప్ సింగ్,  నితీశ్ రాణా,  ఆండ్రూ రసెల్, రింకూ సింగ్,  శార్దూల్ ఠాకూర్,  సునీల్ నరైన్, కుల్వంత్  ఖెర్జోనియా, ఉమేశ్ యాదవ్,  వరుణ్ చక్రవర్తి

ఢిల్లీ క్యాపిటల్స్ : ఫిలిప్ సాల్ట్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్,  మనీష్ పాండే,  అక్షర్ పటేల్, అమన్  ఖాన్, లలిత్ యాదవ్,  కుల్దీప్ యాదవ్, ఆన్రిచ్ నోర్జే,  ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే