IPL: ‘తాజ్’ లో ఢిల్లీ క్యాపిటల్స్.. ‘ట్రిడెంట్’లో ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ జట్లు స్టే చేసే హోటల్స్ ఇవే..

Published : Mar 11, 2022, 08:47 PM IST
IPL: ‘తాజ్’ లో ఢిల్లీ  క్యాపిటల్స్.. ‘ట్రిడెంట్’లో ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ జట్లు స్టే చేసే హోటల్స్ ఇవే..

సారాంశం

IPL 2022: ఐపీఎల్ 2022 కు సమయం దగ్గర పడుతున్నది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీల ప్రతినిధులు ముంబైకి మకాం మార్చారు. కొద్దిరోజుల్లో ఆటగాళ్లు కూడా వారితో కలువనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జట్లన్నీ.. 

ఈ నెల 26 నుంచి ఐపీఎల్-15 మెగా సీజన్ ప్రారంభం కానున్నది. ఈ మేరకు ఇప్పటికే ఆయా జట్లన్నీ ఈ నెల 8 నుంచే ముంబైకి చేరుకుంటున్నాయి. అందుబాటులో ఉన్న ఆటగాళ్లు, కోచ్ లు ప్రతినిధులు,  సహాయక సిబ్బందితో కలిసి మకాం వేస్తున్నాయి.  మరి వందలాది మంది ఉండే ఈ జట్లన్నింటినీ ఎక్కడ ఉంచేది..?   ఆటగాళ్లు,  కోచ్ లు, సహాయక సిబ్బంది, వైద్యులు, ఇతరత్రా డిపార్ట్మెంట్  ల వాళ్లందరూ ఎక్కడ ఉంటారు.  ఇందుకోసం ఆయా జట్లు..  ముంబైలో అత్యంత ఖరీదైన హోటల్స్ ను బుక్ చేసుకున్నాయి.  అవేంటో ఒకసారి ఇక్కడ చూద్దాం. 

ముంబై ఇండియన్స్.. ఐదు సార్లు ఐపీఎల్ విజేత  ముంబై ఈసారి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఉన్న దేశ ఆర్థిక రాజధానిలోనే అత్యంత ఖరీదైన ట్రిడెంట్ మోటల్ ను బుక్ చేసింది. ముంబై ఇండియన్స్ కు చెందిన ప్రతి ఆపరేషన్ అంతా ఇక్కడ్నుంచే ఆపరేట్ కానుంది.  ఆటగాళ్లు, వారి కుటుంబాలు,  కోచ్ లు, ఇతరత్రా సిబ్బంది అంతా  ఉండేందుకు గాను మొత్తం ఈ హోటల్ ను బుక్ చేసుకుంది ముంబై ఇండియన్స్.. 

ఢిల్లీ క్యాపిటల్స్ : ముంబైలోని ప్రముఖ హోటల్ తాజ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బస చేయనుంది. ఈనెల 15 న ఆ జట్టుకు సంబంధించిన కీలక ఆటగాళ్లు, కోచ్ లు, ఇతర సిబ్బంది తాజ్ కు చేరుకుంటారు. 

 

పంజాబ్ కింగ్స్ : ఐపీఎల్ లో ఇంతవరకు ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గని జట్టుగా ఉన్న పంజాబ్ రెనైస్సాన్స్ లో ఉండనుంది. పొవాయ్ లోన ఉన్న ఈ హోటల్ పంజాబ్ ఆటగాళ్లు బస చేస్తారు. 

చెన్నై సూపర్ కింగ్స్ : ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నారీమన్ పాయింట్ లో ఉన్న ట్రిడెంట్ హెటల్ లో ఉండనుంది. ప్రస్తుతం సూరత్ లో ప్రాక్టీస్ సెషనల్ లో ఉన్న సీఎస్కే.. అది ముగియగానే నేరుగా ఇక్కడకు చేరుకుంటుంది. 

రాజస్థాన్ రాయల్స్ : ఈ ఫ్రాంచైజీ ప్రతినిధులు ఇంకా ముంబై చేరుకోలేదు. కానీ రాజస్థాన్ మాత్రం..  ముంబైలో ఉన్న గ్రాండ్ హయాత్ లో తమ ఆటగాళ్లను ఉంచనుంది. 

గుజరాత్ టైటాన్స్ : ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ జేడబ్ల్యూ మారియట్ లో బస చేయనుంది. కానీ ఆ జట్టు పూణెలో ఎక్కువ మ్యాచులు ఆడాల్సి ఉన్నందున అక్కడి కార్నడ్ హోటల్ లో ఆటగాళ్లను ఉంచనుంది. 

లక్నో సూపర్ జెయింట్స్ :   కెఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో జట్టు.. ముంబైలోని కొలబలో ఉన్న తాజ్ వివంట  హోటల్ లో ఉండనుంది. 

 

సన్ రైజర్స్ హైదరాబాద్ : రెండు సార్లు ఐపీఎల్ విజేత సన్ రైజర్స్ హైదరాబాద్.. ఐటీసీ మరాఠాలో బస చేయనుంది.  

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :  ఇప్పటికీ కెప్టెన్ ను ప్రకటించని ఆర్సీబీ.. ఈ సీజన్ ముగిసేవరకు వెస్ట్ బాంద్రాలో ఉన్న తాజ్ లాండ్స్ లో ఉండనున్నట్టు తెలుస్తున్నది. 

కోల్కతా  నైట్ రైడర్స్ :  కొత్త సారథి శ్రేయస్ అయ్యర్  సారథ్యంలోని కోల్కతా.. పరేల్ లో ఉన్న ఐటీసీ  గ్రాండ్ సెంట్రల్ లో బస చేయనుంది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఎలుకకు పిల్లి సాక్ష్యం అంటే ఇదేనేమో.! 'టీ20 ప్రపంచకప్‌ను గిల్ తెచ్చేస్తాడట'.. నమ్మేశాం.. నమ్మేశాం
IPL 2026 auction లో కామెరాన్ గ్రీన్ కు రూ.25 కోట్లు.. చేతికి వచ్చేది రూ.18 కోట్లే ! ఎందుకు?