IPL 2022: తగ్గేదేలే అంటున్న సన్ రైజర్స్ బౌలింగ్ కోచ్.. ఇక ప్రత్యర్థులకు చుక్కలే..

Published : Mar 21, 2022, 01:38 PM IST
IPL 2022: తగ్గేదేలే అంటున్న  సన్ రైజర్స్ బౌలింగ్ కోచ్.. ఇక ప్రత్యర్థులకు చుక్కలే..

సారాంశం

IPL 2022 - Sun Risers Hyderabad: గతేడాది ఐపీఎల్ సీజన్ లో  అట్టడుగున నిలిచిన హైదరాబాద్ జట్టు ఈసారి మత్రం మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తున్నది. ఈ క్రమంలోనే ఆ జట్టు... 

రెండు సార్లు ఐపీఎల్ విజేత సన్ రైజర్స్ హైదరాబాద్  ఈ సీజన్ లో మెరుగైన ప్రదర్శనతో అదరగొట్టాలని భావిస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే ఫ్రాంచైజీకి చెందిన ఆటగాళ్లు, కోచులు,  ఇతర సహాయక సిబ్బంది  అంతా  ప్రాక్టీస్ లో నిమగ్నమైంది.  అయితే  ప్రాక్టీస్ గ్యాప్ లో ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లంతా ఫోటోలకు ఫోజులిచ్చారు. బౌలింగ్, బ్యాటింగ్ కు సంబంధించిన  పలు ఫోజులతో అదరగొట్టారు. అయితే ఇందులో ఆటగాళ్లతో పాటు కోచ్ లు టామ్ మూడీ,  బ్రియాన్ లారా, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ప్రముఖ తెలుగు సినిమా.. ఇప్పటికీ సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తున్న పుష్ప సినిమాలోని ‘తగ్గేదేలే..’ ఫోజును అదరహో అనిపించారు. 

పుష్ప  లోని తగ్గేదేలే ఫోజును ఇమిటేట్ చేసిన వారిలో సన్ రైజర్స్ ఆటగాళ్లు  వాషింగ్టన్ సుందర్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, రాహుల్ త్రిపాఠి లతో పాటు డేల్ స్టెయిన్ కూడా  వీరికి జతకలిశాడు. వీళ్లంతా తగ్గేదేలే ఫోజులు ప్రాక్టీస్ చేయగా కెప్టెన్ విలియమ్సన్ తో పాటు రాహుల్ త్రిపాఠిలు డాన్స్ చేశారు. 

 

‘తగ్గేదేలే’ ఫోజును గతంలో విండీస్ క్రికెటర్ డ్వేన్  బ్రావో, టీమిండియా ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా,  శిఖర్ ధావన్, యుజ్వేంద్ర చాహల్, హార్థిక్ పాండ్యా తో పాటు పలువురు క్రికెటర్లు ఈ ట్రెండ్ ను ఫాలో అయ్యారు. ఇక  మిగతా జట్లతో పోలిస్తే సోషల్ మీడియాలో ట్రెండింగ్ వీడియోలు చేయడంలో వెనుకబడ్డ హైదరాబాద్.. తాజాగా అభిమానులకు ఆ లోటును పూడ్చింది. గడిచిన నాలుగైదు రోజులుగా కొన్ని తెలుగు సినిమా పాటలు, డైలాగులకు ఆటగాళ్ల హావభావాలను జోడించి అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. 

ఇందులో భాగంగానే ‘తగ్గేదేలే..’కు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ‘ఎవరు భాగా చేశారు..?’ అని ఓ ప్రోమోను విడుదల చేసింది. ఇందులో ఆటగాళ్ల కంటే స్టెయిన్ మాత్రం ఇరగదీసే లుక్స్ తో డెడికేషన్ తో ప్రాక్టీస్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. 

 

ఐపీఎల్  లో రెండు సార్లు విజేతగా నిలిచిన హైదరాబాద్ ఫ్రాంచైజీ  2022 సీజన్ లో భాగంగా  ఈనెల 29న తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ రోజున సన్ రైజర్స్ పూణెలోని ఎంసీఎ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచులో తలపడబోతుంది. 

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?