
వెస్టిండీస్ ఆల్‌రౌండర్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ టీమ్ ప్లేయర్ ఆండ్రే రస్సెల్... ఓ ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. ఆకుపచ్చ రంగులో అందంగా మెరిసిపోతున్న మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీటీ ఆర్ కలర్ మోడల్ కారుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఆండ్రే రస్సెల్...
‘ఓ గెట్టో యూట్‌గా నేనెప్పుడూ పెద్ద కలలే కన్నాను. కానీ కఠినమైన శ్రమ, కొన్నింటిని త్యాగం చేయడం ద్వారా ఆ కలలను నిజం చేసుకోగలిగాను. దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడు...’ అంటూ తన వెస్టిండీస్ టీమ్ మేట్, కేకేఆర్ టీమ్ మేట్, ఆల్‌రౌండర్ సునీల్ నరైన్‌ని ట్యాగ్ చేశాడు ఆండ్రే రస్సెల్...
ఆండ్రే రస్సెల్ కొనుగోలు చేసిన కారు ఖరీదు రూ.2 కోట్ల 71 లక్షలకు పైనే. ఖరీదైన కారు కొనుగోలు చేసిన ఆండ్రే రస్సెల్‌కి భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపాడు... ‘కంగ్రాట్స్ బిగ్ మ్యాన్... ఇలాంటివి చాలా రావాలి...’ అంటూ ఫైర్ ఎమోజీని జత చేసి కామెంట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్...
ఆండ్రే రస్సెల్ వీడియోపై వెస్టిండీస్ క్రికెటర్లు క్రిస్ గేల్ ‘సిక్’ అని లూయిస్ ‘బ్యాడ్’ అని ఫన్నీగా కామెంట్లు చేయగా సౌతాఫ్రికా స్పిన్నర్ షంసీ ‘బిగ్ మెషీన్’ అంటూ కామెంట్ చేశాడు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆండ్రే రస్సెల్‌ని రూ.12 కోట్లకు మొదటి రిటెన్షన్‌గా రిటైన్ చేసుకుంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. ఐపీఎల్ 2022 సజన్‌లో 14 మ్యాచులు ఆడిన ఆండ్రే రస్సెల్ బ్యాటుతో 174.48 స్ట్రైయిక్ రేటుతో 37.22 సగటుతో 335 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది...
బౌలింగ్‌లోనూ అదరగొట్టిన ఆండ్రే రస్సెల్ 9.87 ఎకానమీతో 17 వికెట్లు తీశాడు. అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచుల్లో 6 విజయాలు, 8 పరాజయాలు అందుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్, పాయింట్ల పట్టికలో 7వ స్థానంతో సరిపెట్టుకుంది...
గత ఏడాది ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో ఐపీఎల్ 2021 ఫైనల్‌కి అర్హత సాధించింది కేకేఆర్. ఫస్టాఫ్‌లో 2 విజయాలు మాత్రమే అందుకున్న కోల్‌కత్తా, సెకండాఫ్‌లో అద్భుత విజయాలతో ఫ్లేఆఫ్స్‌కి దూసుకెళ్లి, ఫైనల్ చేరింది...
2021 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్, ఈ సారి పెద్దగా పర్ఫామెన్స్ చూపించలేకపోయాడు. అతనితో పాటు రిటైన్ చేసుకున్న సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి... సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. సునీల్ నరైన్ పొదుపుగా బౌలింగ్ చేసి పర్వాలేదనిపించినా, బ్యాటుతో రాణించలేకపోయాడు...
మిస్టరీ స్పిన్నర్‌గా ఐపీఎల్ 2021 సీజన్ పర్పామెన్స్‌తో టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలోనే చోటు దక్కించుకున్న వరుణ్ చక్రవర్తి... ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోయాడు..