
IPL 2021 సమరం ముగిసింది. విజయం చెన్నై సూపర్ కింగ్స్ కి విజయం దక్కింది. అయితే.. ఐపీఎల్ చరిత్రలో దాదాపు ఐదుసార్లు.. ముంబయి ఇండియన్ ఛాంపియన్ గా నిలిచింది. త్వరలో 2022 ఐపీఎల్ సమరం కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటి నుంచే ముంబయి ఇండియన్స్ జట్టు విషయంలో కసర్తత్తులు ప్రారంభించడం మొదలుపెట్టింది.
ఈ క్రమంలో.. ముంబయి ఇండియన్స్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ను ఆ జట్టు వదులుకోవాలని అనుకుంటోందట. 2022 సీజన్ ఐపీఎల్ వేలానికి హార్దిక్ పాండ్యాను పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఐపీఎల్ లో అదనంగా.. రెండు కొత్త జట్లు అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్నో, అహ్మదాబాద్ జట్లను ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి.
ఈ ఏడాది డిసెంబర్ లోనే ఐపీఎల్ వేలం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలో 2022 సీజన్ ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. కాగా.. ఈ విషయంపై ఐపీఎల్ అధికారి ఒకరు స్పందించారు.
"బిసిసిఐకి ఒక రైట్ టు మ్యాచ్ కార్డ్‌తో ముగ్గురు ఆటగాళ్ల రిటెన్షన్ ఫార్ములా ఉంటుందని నేను భావిస్తున్నాను. RTM లేకపోతే, నాలుగు రిటెన్షన్‌లు ఉండవచ్చు. రోహిత్ శర్మ మరియు భారత పేస్ స్పియర్‌హెడ్ జస్ప్రీత్ బుమ్రా ఆటోమేటిక్ ఎంపికలు.’’ అని పేర్కొన్నారు.
Also Read: T20 worldcup 2021: డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ... ఆస్ట్రేలియాకి వరుసగా రెండో విజయం...
"కీరన్ పొలార్డ్ మూడవ స్థానంలో ఉంటాడు. ఈ మూడు MI యొక్క మూలస్తంభాలు కాబట్టి MI యొక్క బలం వారి కొనసాగింపు" అని ఫ్రాంచైజీల నిలుపుదల మార్కెట్‌ను ట్రాక్ చేస్తున్న సీనియర్ IPL అధికారి PTIకి చెప్పారు.’’ అని చెప్పారు.
"ఈ సమయంలో, హార్దిక్‌ను MI రిటైన్ చేసే అవకాశం 10 శాతం కంటే తక్కువగా ఉంది. అవును, అతను రాబోయే కొన్ని T20 ప్రపంచ కప్ గేమ్‌లలో అందరినీ అధిగమించవచ్చు, కానీ అప్పుడు కూడా, అవకాశాలు మసకగా ఉంటాయి. నాలుగు రిటెన్షన్‌లు ఉంటే. లేదా 1 RTM, ఆపై సూర్యకుమార్ యాదవ్ మరియు ఇషాన్ కిషన్ ఆ స్లాట్‌కు పోటీదారులుగా ఉన్నారు" అని IPL అధికారి పేర్కొన్నారు.
More news to Read: T20 worldcup 2021: భారీగా మొదలెట్టి, ఆస్ట్రేలియా ముందు ఊరించే టార్గెట్ పెట్టిన శ్రీలంక...
హార్దిక్ పాండ్యా రెండేళ్ల క్రితం సూపర్ గా ఆడేవాడని.. కానీ ఇప్పుడు అలా ఆడటం లేదని.. అందుకే.. ముంబయి ఇండియన్స్.. హార్దిక్ పాండ్యాను వదిలేయాలని అనుకుంటోందని ఆయన పేర్కొన్నారు.
ఒకప్పుడు రోహిత్ చాలా ఫాస్ట్ బౌలింగ్ చేసేవాడని.. కానీ ఇప్పుడు అలా చేయడం లేదని ఆ ఐపీఎల్ అధికారి పేర్కొనడం గమనార్హం. మరి ఈసారి ఐపీఎల్ వేలంలో.. హార్దిక్ పాండ్యా.. ఏ జట్టు దక్కించుకోనుందో చూడాలి.
More News to Read: స్వదేశానికి చేరుకున్న ఆవేశ్ ఖాన్... నెట్ బౌలర్ నుంచి న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి...