IPL 2022: పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం అన్నట్టుగా గుజరాత్-బెంగళూరు పోరు.. టాస్ నెగ్గిన పాండ్యా

By Srinivas MFirst Published May 19, 2022, 7:07 PM IST
Highlights

IPL 2022 RCB vs GT: ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ తేలే సమయం ఆసన్నమైంది. నేడు ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ తో డూ ఆర్ డై మ్యాచ్ లో తలపడుతున్నది. ఈ మ్యాచ్ ఓడితే ఆర్సీబీ అభిమానుల ఆశలు గల్లంతే.. 

ఐపీఎల్-15లో రాయల్ ఛాలెంజర్స్ ప్లే ఆఫ్స్ చేరుతుందా..? చేరదా..? నేటితో తేలిపోతుంది.  గుజరాత్ టైటాన్స్ తో నేడు ఆ జట్టు కీలక పోరులో తలపడనున్నది. ఈ  రెండు జట్లకు లీగ్ లో ఇదే చివరి మ్యాచ్. కీలక సమరంలో హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ బౌలింగ్ చేయనుంది.  లీగ్ దశను విజయంతో  ముగించి  ప్లేఆఫ్స్ కు ఫుల్ జోష్ తో వెళ్లాలని గుజరాత్ భావిస్తుండగా.. ప్లేఆఫ్స్ కు వెళ్లేందుకు ఆర్సీబీ శతవిధాలా ప్రయత్నిస్తున్నది. ఈ మ్యాచ్ ఓడితే  ఆ  జట్టు ప్లేఆఫ్ ఆశలు గల్లంతే..

ఇప్పటికే  ఐపీఎల్-2022 ప్లేఆఫ్స్ కు అర్హత సాధించడమే గాక పాయింట్ల పట్టికలో  అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ కు ఈ మ్యాచ్ గెలిచినా ఓడినా  జట్టుకు పోయేదేమీ లేదు. కానీ ఆర్సీబీకి అలా కాదు. ఈ మ్యాచ్ గెలవాలి.. మాములుగా గెలిచినా సరిపోదు.. భారీ తేడాతో నెగ్గాలి.మీ అలా నెగ్గినా ఆర్సీబీకి ప్లేఆఫ్స్ మీద ధీమా లేదు. ఆ జట్టు ఢిల్లీ-ముంబై మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడితే ప్లేఆఫ్స్ కు వెళ్లే ఛాన్సుంది. మరి ఈ సమీకరణాలన్నీ ఆర్సీబీకి అనుకూలంగా వస్తాయా..? ఈ నేపథ్యంలో  మ్యాచ్ ను చూస్తుంటే పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటంలా మారింది.  

ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఒక మార్పు చేశాయి. గుజరాత్ టైటాన్స్   లో అల్జారీ జోసెఫ్ స్థానంలో లాకీ ఫెర్గూసన్ ఆడుతున్నాడు. ఇక ఆర్సీబీలో మహ్మద్ సిరాజ్ స్థానంలో సిద్ కౌల్ బరిలోకి దిగుతున్నాడు. ఇరు జట్ల మధ్య ఈ సీజన్ లో జరిగిన  మ్యాచ్ లో  గుజరాత్ టైటాన్స్ నే విజయం వరించిన విషయం తెలిసిందే. 

తుది జట్లు : 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, మహిపాల్ లోమ్రర్, దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హెజిల్వుడ్ 

గుజరాత్ టైటాన్స్ : శుభమన్ గిల్,  వృద్ధిమాన్ సాహా,  మాథ్యూ వేడ్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, మహ్మద్ షమీ 

click me!