
దూకుడుకు మారుపేరైన virat kohli.. ఆన్ ది ఫీల్డ్ లో అగ్రెసివ్ గా ఉంటాడు. అది భారత జట్టు మ్యాచ్ అయినా.. ipl అయినా.. గ్రౌండ్ లో కోహ్లి ఎమోషన్స్ హై లో ఉంటాయి. బ్యాటింగ్ లో ప్రత్యర్థులను రఫ్ఫాడించే కింగ్ కోహ్లి.. ఫీల్డింగ్ లో కూడా పాదరసంలా కదులుతాడు. తన ఫిల్డర్లు ఎవరైనా క్యాచ్ గానీ, బంతిని గానీ మిస్ చేస్తే వారిపైనా అక్కడే అసహనం వ్యక్తం చేస్తాడు. అయితే అది కొద్దిసేపు మాత్రమే.
బుధవారం నాటి మ్యాచ్ లో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. Sun Risers Hyderabad తో తలపడ్డ RCB.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ రెండో ఓవర్లో అప్పటికే ఓ ఫోర్, సిక్సర్ కొట్టి జోరు మీద కనిపించాడు. ఆ సమయంలో గార్టన్ వేసిన నాలుగో బంతిని శర్మ గాల్లోకి లేపాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న పేసర్ SIRAJ పరుగెత్తుకుంటూ వచ్చినా క్యాచ్ ను డ్రాప్ చేశాడు.
ఇది చూసిన Royal challengers hygerabad సారథి గుస్సా అయ్యాడు. ఇదేంటి.. సిరాజ్ ఇలా వదిలేసావ్.. అన్నట్టుగా సిరాజ్ వైపు చూశాడు. కాగా, తర్వాత బంతికే శర్మ ఔటవ్వడంతో కోహ్లి ముఖంలో మళ్లీ నవ్వు విరిసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదిలాఉండగా.. నిన్న రాత్రి ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో SRH జట్టు నాలుగు పరుగుల తేడాతో విరాట్ సేనను చిత్తు చేసింది. 142 పరుగుల లక్ష్యంతో ఛేదన ప్రారంభించిన కోహ్లి జట్టు.. విజయానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచింది. నిన్నటి మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి గురిపెట్టిన బెంగళూరు ఆశలు ఆవిరయ్యాయి.