ఉమ్రాన్ ఆట చూసి.. నా భార్య ఆనందంతో ఏడ్చేసింది.. తండ్రి అబ్దుల్ మాలిక్..!

By telugu news teamFirst Published Oct 7, 2021, 11:27 AM IST
Highlights

ఈ క్రమంలో ఉమ్రాన్ మాలిక్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఉమ్రాన్ కి ఐపీఎల్ లో ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. కాగా.. ఉమ్రాన్ విజయం పట్ల అతని తండ్రి అబ్దుల్ మాలిక్ స్పందించాడు

ఐపీఎల్‌-2021 భాగంగా  బుధవారం జరిగిన మ్యాచ్ లో  అనూహ్యంగా సన్ రైజర్స్ కి విజయం దక్కింది. కచ్చితంగా బెంగళూరు గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ.. సన్ రైజర్స్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ మాయజాలంతో  సన్ రైజర్స్ ని గెలిపించాడు.

 సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్‌ నటరాజన్‌ కోవిడ్‌ బారిన పడటంతో జట్టులోకి వచ్చాడు ఉమ్రాన్‌ మాలిక్‌. ఇటీవల కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అరంగేట్ర మ్యాచ్‌ ఆడిన ఈ జమ్మూ కశ్మీర్‌ ఫాస్ట్‌ బౌలర్‌... ఈ సీజన్‌లోనే అ‍త్యంత వేగవంతంగా(సుమారు గంటకు 153 కి.మీ.) బంతిని విసిరాడు.

 ఐపీఎల్‌-2021లో ఇప్పటి వరకు భారత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ డెలివరీ చేసిన బౌలర్‌గా నిలిచి.. క్రీడా పండితుల దృష్టిని ఆకర్షించాడు. ఇక రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీకర్‌ భరత్‌(12)ను అవుట్‌ చేయడం ద్వారా.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో తన తొలి వికెట్‌ నమోదు చేశాడు. 4 ఓవర్లు వేసిన ఉమ్రాన్‌.. 21 పరుగులు మాత్రమే ఇచ్చి సత్తా చాటాడు.

ఈ క్రమంలో ఉమ్రాన్ మాలిక్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఉమ్రాన్ కి ఐపీఎల్ లో ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. కాగా.. ఉమ్రాన్ విజయం పట్ల అతని తండ్రి అబ్దుల్ మాలిక్ స్పందించాడు.

తమ కుమారుడు సాధించిన ఈ విజయం అతి సాధారణమైనది కాదని ఆయన అన్నాడు. ‘‘నా కొడుకు కేవలం 3 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు క్రికెట్ వైపు మొగ్గు చూపాడు. అతను ఎప్పుడూ ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలని కలలు కనేవాడు. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ ద్వారా ప్లేయింగ్ ఎలెవన్‌లో అతను ఎంపికైనప్పుడు మేము చాలా సంతోషించాము. మేము టీవీకి అతుక్కుపోయాము మరియు నా  నా భార్య కళ్ళలో ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. నా కొడుకు చాలా కష్టపడ్డాడు. మేము ఎల్లప్పుడూ అతనికి మద్దతు ఇచ్చాము. ఏదో ఒక రోజు అతను టీమిండియా తరఫున ఆడతాడని మేము ఆశిస్తున్నాము "అని అబ్దుల్ మాలిక్ అన్నారు.

click me!