ipl 2021: ఉమ్రాన్ ఖాన్ బౌలింగ్.. ట్విట్టర్ ఫిదా..!

Published : Oct 07, 2021, 10:25 AM IST
ipl 2021: ఉమ్రాన్ ఖాన్ బౌలింగ్.. ట్విట్టర్ ఫిదా..!

సారాంశం

ఇప్పుడు ఈ సన్ రైజర్స్ బౌలర్ పై  ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలో ఉమ్రాన్ ఖాన్ ని నెటిజన్లు పొగిడేస్తున్నారు. బెంగళూరు జట్టును గడగడలాడించాడంటూ ట్వీట్స్ చేస్తున్నారు. 

ఐపీఎల్‌-2021 రెండో అంచెలో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్‌ నటరాజన్‌ కోవిడ్‌ బారిన పడటంతో జట్టులోకి వచ్చాడు ఉమ్రాన్‌ మాలిక్‌. ఇటీవల కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అరంగేట్ర మ్యాచ్‌ ఆడిన ఈ జమ్మూ కశ్మీర్‌ ఫాస్ట్‌ బౌలర్‌... ఈ సీజన్‌లోనే అ‍త్యంత వేగవంతంగా(సుమారు గంటకు 153 కి.మీ.) బంతిని విసిరాడు.

 ఐపీఎల్‌-2021లో ఇప్పటి వరకు భారత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ డెలివరీ చేసిన బౌలర్‌గా నిలిచి.. క్రీడా పండితుల దృష్టిని ఆకర్షించాడు. ఇక రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీకర్‌ భరత్‌(12)ను అవుట్‌ చేయడం ద్వారా.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో తన తొలి వికెట్‌ నమోదు చేశాడు. 4 ఓవర్లు వేసిన ఉమ్రాన్‌.. 21 పరుగులు మాత్రమే ఇచ్చి సత్తా చాటాడు.

 

దీంతో.. ఇప్పుడు ఈ సన్ రైజర్స్ బౌలర్ పై  ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలో ఉమ్రాన్ ఖాన్ ని నెటిజన్లు పొగిడేస్తున్నారు. బెంగళూరు జట్టును గడగడలాడించాడంటూ ట్వీట్స్ చేస్తున్నారు. వచ్చే ఐపీఎల్ వేలంలో కచ్చితంగా ఎక్కువ ధర పలుకుతాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేయడం గమనార్హం.

ఉమ్రాన్ ఖాన్ ఆట చూస్తేంటే.. ఒళ్లు గగ్గురుపుట్టించిందని వసీమ్  జాఫర్ చేసిన ట్వీట్ విపరీతంగా ఆకట్టుకుంది.
 

PREV
click me!

Recommended Stories

Sophie Devine : 4, 4, 6, 6, 6, 6 అమ్మబాబోయ్ ఏం కొట్టుడు.. ఒక్క ఓవర్‌లో 32 రన్స్
IND vs NZ : కోహ్లీ, గిల్ విధ్వంసం.. కేఎల్ రాహుల్ మాస్ ఫినిషింగ్