IPL 2021 SRH vs RCB: బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్.. నెక్స్ట్ టార్గెట్ బ్రావోనే..

Published : Oct 06, 2021, 10:46 PM IST
IPL 2021 SRH vs RCB: బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్.. నెక్స్ట్ టార్గెట్ బ్రావోనే..

సారాంశం

Harshal Patel: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ నయా రికార్డు నెలకొల్పాడు. ఈ ఐపీఎల్ లో మరే బౌలర్ కు సాధ్యం కాని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.   

ప్రస్తుత IPL-14 సీజన్ లో తొలి నుంచి అదరగొడుతున్న Royal challengers banglore బౌలర్ హర్షల్ పటేల్ కొత్త రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉన్న రికార్డును హర్షల్ బద్దలుకొట్టాడు. ఒక ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్లు (29) తీసుకున్న భారతీయ బౌలర్ గా అతడు కొత్త చరిత్ర సృష్టించాడు. 

బుధవారం సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 3 వికెట్లు తీసుకున్న పటేల్.. ఒక్క ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న భారత బౌలర్ గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు bumrah (27 వికెట్లు) పేరిట ఉంది. ఐపీఎల్ 2020 ఎడిషన్ లో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. బుమ్రా కంటే ముందు ఈ రికార్డు 2017 లో భువనేశ్వర్ (26 వికెట్లు) పేరిట ఉంది.  

ఐపీఎల్ 14లో ఇప్పటివరకు 13 మ్యాచ్ లాడిన హర్షల్.. 29 వికెట్లతో ఇప్పటికే Purple cap కూడా దక్కించుకున్నాడు. అయితే ఒక ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో హర్షల్ మూడో స్థానంలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో (2013 లో 32 వికెట్లు), ఢిల్లీ బౌలర్ కగిసొ రబడ (2020  లో 30 వికెట్లు).. పటేల్ కంటే ముందున్నారు. ఆర్సీబీకి మరో లీగ్ మ్యాచ్ తో పాటు ప్లే ఆఫ్స్ గెలిస్తే ఇంకో 3 మ్యాచ్ లు ఆడే అవకాశముంది. దీంతో  బ్రావో రికార్డు చెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది.

PREV
click me!

Recommended Stories

Sophie Devine : 4, 4, 6, 6, 6, 6 అమ్మబాబోయ్ ఏం కొట్టుడు.. ఒక్క ఓవర్‌లో 32 రన్స్
IND vs NZ : కోహ్లీ, గిల్ విధ్వంసం.. కేఎల్ రాహుల్ మాస్ ఫినిషింగ్