IPL 2021 RCB vs SRH: రాణించిన రాయ్.. ఆర్సీబీ ముందు ఈజీ టార్గెట్.. స్వల్ప లక్ష్యాన్ని హైదరాబాద్ కాపాడుకునేనా..?

By team teluguFirst Published Oct 6, 2021, 9:23 PM IST
Highlights

IPL 2021 RCB vs SRH: లీగ్ దశ మ్యాచ్ లు ముగింపునకు చేరుకున్న ఐపీఎల్ లో చివరి రెండు మ్యాచ్ లైనా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. బెంగళూరుతో జరుగుతున్న పోరులో మునపటిలాగే బ్యాటింగ్ లో తడబడింది.  ఆర్సబీ ముందు 142 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 

రాయల్ ఛాలెంజర్స్ తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్ లో పరువు దక్కించుకోవాలని ఆరాటపడుతున్న Sun Risers Hyderabad ఓ మోస్తారు టార్గెట్ ను virat సేన ముందుంచుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన SRH... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. హైదరాబాద్ ఓపెనర్ jason roy (38 బంతుల్లో 44) టాప్ స్కోరర్.  

జేసన్ రాయ్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన అభిషేక్ శర్మ (13) రెండో ఓవర్లోనే ఔటయ్యాడు. జార్జ్ గార్టన్ వేసిన ఆ ఓవర్లో తొలి బంతికి ఫోర్, తర్వాత  బాల్ కు సిక్సర్ కొట్టి  ఊపు మీద కనిపించిన శర్మ.. నాలుగో బంతికే  Maxwellకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన SRH సారథి kane Williamson (29 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 31).. రాయ్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇద్దరు కలిసి చూడచక్కని కవర్ డ్రైవ్ లు, స్క్కేర్ డ్రైవ్ షాట్లతో కాసేపు అభిమానులను అలరించారు. ఈ జోడీ క్రీజులో కుదురుకుంటున్న తరుణంలో 11వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్ కేన్ మామను బౌల్డ్ చేసి హైదరాబాద్ ను దెబ్బకొట్టాడు. 

విలియమ్సన్ ఔటయ్యాక సన్ రైజర్స్ కు కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడంతో స్కోరు బోర్డు నెమ్మదించింది.  ప్రియం గార్గ్ (15), అబ్దుల్ సమద్ (1) తో వరుస ఓవర్లలో ఔటయ్యారు. ఐదు ఫోర్లు కొట్టి ధాటిగా ఆడిన జేసన్ రాయ్ కూడా 14వ ఓవర్ చివరిబంతికి క్రిస్టియన్ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 
ఆ తర్వాత వచ్చిన సాహా కూడా హర్షల్ బైలింగ్ లోనే డివిలియర్స్ కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.

దీంతో 11 ఓవర్లకు 84/2 గా పటిష్ట స్థితిలో ఉన్న హైదరాబాద్ స్కోరు.. 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. చివరి ఐదు ఓవర్లలో 34 పరుగులే వచ్చాయి. హైదరాబాద్ తరఫున అభిషేక్, ప్రియం గార్గ్ తప్ప మరో బ్యాట్స్మెన్ సిక్సర్ కొట్టలేదు.

రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లలో డేనియల్ క్రిస్టియన్  3 ఓవర్లలో 14 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ హోల్డర్ హర్షల్ పటేల్ 33 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. చాహల్ (1), గార్టన్ (1) ఫర్వాలేదనిపించారు. 

హర్షల్ పటేల్.. విలియమ్సన్ ను ఔట్ చేయగానే ఒక ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్ (27 వికెట్లు) గా రికార్డు సాధించాడు. ఈ రికార్డు గతంలో బుమ్రా (27), భువనేశ్వర్ (26) పేరిట ఉంది. 
 

click me!