తండ్రి కూరగాయల వ్యాపారి.. కొడుకు ఈ ఐపీఎల్ సీజన్ లోనే అత్యంత వేగంగా బంతులు వేసిన బౌలర్..

By team teluguFirst Published Oct 6, 2021, 10:15 PM IST
Highlights

IPL 2021 RCB vs SRH: ఐపీఎల్  సెకండ్ ఫేజ్ లో రాక రాక వచ్చిన అవకాశాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రన్ మాలిక్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ఇప్పుడీ పేరు జమ్ము, కాశ్మీర్ లో మార్మోగిపోతున్నది. 

గత మ్యాచ్ లో Kolkata knight Ridersతో  అత్యంత వేగంగా బంతులు విసిరిన హైదరాబాద్ బౌలర్ umran malik ఇప్పుడు నయా సంచలనం. ఈ జమ్ము కశ్మీర్ కుర్రాడు ఆ మ్యాచ్ లో ఏకంగా 151 కిలో మీటర్ల వేగంతో బంతులు విసిరి శభాష్ అనిపించుకున్నాడు. ఈ సీజన్ లో భారత్ తరఫున అంత వేగంగా బంతిని విసిరింది ఉమ్రన్ ఒక్కడే కావడం గమనార్హం.నెట్ బౌలర్ గా sun risers hyderabad టీమ్ లో ఉన్న ఉమ్రన్.. ఒక్క మ్యాచ్ తో ఓవర్ నైట్  స్టారయ్యాడు. అయితే తన గురించి దేశం మాట్లాడుకుంటున్న విషయం ఉమ్రన్ కు తెలుసో లేదో గానీ అతడి తండ్రి మాత్రం విజయగర్వంతో ఉప్పొంగిపోతున్నాడు. 

Jammuకు చెందిన ఉమ్రన్ మాలిక్ తండ్రి పేరు అబ్దుల్ మాలిక్. అబ్దుల్ మాలిక్ ది పేద కుటుంబం. అతడు జమ్ములోని షహీద్ చౌరస్తా దగ్గర తోపుడు బండి మీద కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన కొడుకు ఐపీఎల్ లో ఆడటమే ఒక ఎత్తయితే.. ఉమ్రన్ రికార్డు స్పెల్ వేయడంపై ఆయన ఆనందం పట్టలేకపోతున్నాడు. తన కొడుకు భారత్ తరఫున కూడా ఆడాలని ఆ తండ్రి ఆకాంక్షిస్తున్నాడు. 

ఉమ్రన్ మాలిక్  వెలుగులోకి వచ్చినప్పట్నుంచి అబ్దుల్ మాలిక్ దగ్గరికి జనాల తాకిడి ఎక్కువైంది. అందరూ ఉమ్రన్ జీవితం గురించి వాకబు చేసేవారే. వాళ్లందరికీ కొడుకు గురించి చెబుతూ మురిసిపోతున్నాడు ఆ తండ్రి. ఈ సందర్భంగా ఆయనను కలిసిన మీడియా ప్రతినిధులతో.. ‘నా కొడుకు మూడేండ్ల వయసున్నప్పుడే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. వాడు ఎప్పుడూ ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలని కలలు కనేవాడు. హైదరాబాద్ తరఫున ఎంపికైనప్పుడు, ఆదివారం కోల్కతాతో మ్యాచ్ ఆడే అవకాశం వచ్చినప్పుడు మా ఆనందానికి అవధుల్లేవు. ఆనందంతో నేను, నా భార్య కండ్ల వెంట నీళ్లు వచ్చాయి. ఈ స్థాయికి రావడానికి నా కొడుకు చాలా కష్టపడ్డాడు. ఉమ్రన్ ఏదో ఒకరోజు టీమ్ ఇండియా తరఫున  ఆడతాడని మేము ఆశిస్తున్నాము’ అంటూ అబ్దుల్ మాలిక్ ఉప్పొంగిపోయాడు. 

అంతేగాక.. ‘ఇది మాకు అత్యంత ఆనందమైన సమయం. మాది చాలా పేద కుటుంబం. నేను పండ్లు, కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషిస్తాను. నా కొడుకు మమ్మల్ని గర్వపడేలా చేశాడు. లెఫ్టినెంట్ గవర్నర్ గారు నా కొడుకు గురించి తెలిసి మమ్మల్ని అభినందించారు’ అంటూ చెప్పుకొచ్చారాయన. 

When you make it to one of the biggest stages in Cricket, your family can be nothing but proud. pic.twitter.com/6NsH5CXbVz

— SunRisers Hyderabad (@SunRisers)

ఇదిలాఉండగా.. తన కుటుంబం అంతా కలిసి ఉమ్రన్ కు శుభాకాంక్షలు చెబుతూ ఓ వీడియో తీసి పంపారు. ఈ వీడియోను సన్ రైజర్స్ జట్టు ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఇది చూసిన ఉమ్రన్.. కన్నవాళ్ల కష్టం గుర్తొచ్చి కంటనీరు పెట్టుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నది.

click me!