IPL 2021: జస్ప్రిత్ బుమ్రాలో ఈ యాంగిల్ కూడా ఉందా... భార్య సంజనాతో కలిసి హోటల్ రూమ్‌లో...

By Chinthakindhi RamuFirst Published Oct 13, 2021, 5:52 PM IST
Highlights

ఇన్‌స్టాలో ట్రెండ్ అవుతున్న ‘వైబ్ చెక్’ వీడియోను భార్యతో కలిసి చేసిన జస్ప్రిత్ బుమ్రా... సైలెంట్‌గా ఉండే బుమ్రా, పెళ్లైన తర్వాత ఫుల్లీ రొమాంటిక్‌గా మారిపోయాడంటూ నెటిజన్ల కామెంట్లు...

భారత జట్టులో చాలా రిజర్వు ప్లేయర్ అంటే జస్ప్రిత్ బుమ్రానే. వికెట్లు తీసిన తర్వాత సెలబ్రేట్ చేసుకున్నా, మిగిలిన సందర్భాల్లో చాలా సైలెంట్‌గా ఉంటాడు ఈ ముంబై బౌలర్... భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కూడా బుమ్రా చాలా నెమ్మదస్తుడని, సరదాకి ఏదైనా మాట అన్నా కూడా ఫీల్ అయిపోతాడని కామెంట్ చేశాడు...

అయితే పెళ్లైన తర్వాత జస్ప్రిత్ బుమ్రాలో చాలా మార్పు కనిపిస్తోంది. స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్‌తో రహస్య ప్రేమాయణం నడిపి, పెళ్లి చేసుకున్న జస్ప్రిత్ బుమ్రా... ఇప్పుడు భార్యతో కలిసి ఫన్నీ వీడియోలు చేస్తూ  వాటిని అభిమానులతో పంచుకుంటున్నాడు... ప్రస్తుతం ఇన్‌స్టాలో ట్రెండ్ అవుతున్న ‘వైబ్ చెక్’ వీడియోను భార్యతో కలిసి చేశాడు జస్ప్రిత్ బుమ్రా.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by jasprit bumrah (@jaspritb1)

ఇందులో రెండు ఆప్షన్లలో ఒక్కదాన్ని ఎంచుకుని, అటువైపు వెళ్లాల్సి ఉంటుంది. అయితే కొన్నింట్లో బుమ్రా సెలక్షన్‌కీ, సంజన సెలక్షన్‌కీ తేడాలు ఉండడంతో భార్యను అటువైపు లాక్కెళ్లుతూ కొంటె కోణాన్ని కూడా చూపించాడు ఈ స్టార్ పేసర్... దీంతో చాలామంది నెటిజన్లు పెళ్లికి ముందు చాలా సైలెంట్‌గా ఉండే బుమ్రా, సంజనాతో ముడిపడిన తర్వాత చాలా రొమాంటిక్‌గా మారిపోయాడంటూ కామెంట్లు పెడుతున్నారు...

జస్ప్రిత్ బుమ్రా సోషల్ మీడియా అకౌంట్లలో భారత జట్టు, ఐపీఎల్ మ్యాచ్‌లకి సంబంధించిన ఫోటోలను, అప్పుడప్పుడూ జిమ్ ఫోటోలను మాత్రమే పంచుకునే బుమ్రాలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు అతని అభిమానులు ఈ వీడియోలను చూసి...

ఐపీఎల్ 2021 సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన జస్ప్రిత్ బుమ్రా, 21 వికెట్లు తీసి ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చాడు. గత రెండు సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, ఈసారి నెట్‌ రన్‌రేట్ తక్కువగా ఉండడంతో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేక ఐదో స్థానంతో సరిపెట్టుకుంది...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కథ ముగియడంతో ప్రస్తుతం యూఏఈలోనే భారత జట్టు ఏర్పాటుచేసిన బయో బబుల్‌లో చేరిన బుమ్రా, భార్య సంజనాతో కలిసి క్వారంటైన్ గడుపుతున్నాడు...

click me!