IPL2021 DC vs KKR: ఈసారి కప్ మాదే.. ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ టైటిల్ ఎలా గెలవగలదో చెప్పిన పాంటింగ్

By team teluguFirst Published Oct 13, 2021, 5:22 PM IST
Highlights

IPL2021 DC vs KKR: ఐపీఎల్-14 సీజన్ ను తాము గెల్చుకుంటామని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు. తాను కోచ్ గా వచ్చిందే ఢిల్లీకి కప్ అందించడానికని చెప్పాడు. 

ప్రస్తుత IPL సీజన్ లో ఒకట్రెండు మ్యాచ్ లు తప్పితే నిలకడగా రాణిస్తున్న జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. మూడు రోజుల క్రితం తొలి క్వాలిఫైయర్ లో భాగంగా ఆ జట్టు Chennai Super Kings చేతిలో ఓడిపోయింది. నేటి సాయంత్రం ఆ జట్టు Kolkata Knight Ridersతో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఈసారి ఐపీఎల్ కప్ కొట్టేది తామే అని ధీమాగా చెబుతున్నాడు ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్. 

ఇదే విషయమై Ricky Ponting మాట్లాడుతూ.. ‘నేను గత మూడేండ్లుగా ఢిల్లీతో ఉన్నాను. తొలి ఏడాది మేము పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచాం. ఆ తర్వాత ఏడాది మూడో స్థానంలో నిలిచాం. ఇక గతేడాది తృటిలో కప్పు కోల్పోయి రెండో స్థానంలో ఉన్నాం. ఈసారి ఐపీఎల్ మాదే.  మా  ఆటగాళ్లతో పాటు నేనూ ఈ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నాను’ అని అన్నాడు.

అంతేగాక ఇంకా స్పందిస్తూ.. ‘ఇది గతంలో ఉన్న ఢిల్లీ కాదు. ఈ జట్టు పూర్తి ప్రత్యేకం. మేము ఇక్కడ ఎందుకున్నామో మా అందరికీ తెలుసు. మేము నాలుగు మాటలకు కట్టుబడి ఉన్నాము. అటిట్యూడ్, ఎఫర్ట్, కమిట్మెంట్, కేర్. వాటికి కట్టుబడి మేము ఆడుతున్నాం’ అని చెప్పుకొచ్చాడు. 

ఇది కూడా చదవండి: కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పించారో కారణం చెప్పలేదు.. తీవ్ర నిరాశలో ఉన్నా.. మనసులో బాధ బయటపెట్టిన వార్నర్ భాయ్

ప్రయత్నం, నిబద్ధతతో ఈ జట్టుకు ఆకాశమే  హద్దు అని పాంటింగ్  అన్నాడు. తాము ఒక్క సీజన్ తో సంతృప్తి చెందబోమని, ప్రతి సీజన్  లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించడానికి ప్రయత్నిస్తామని తెలిపాడు. ‘మేమిక్కడికి టైటిల్ గెలవడానికే వచ్చాం. గతంలో మేం మంచి క్రికెటే ఆడాం. కానీ ఇంకా మేము కప్ గెలవలేదు. ఈసారి దానిని సాధిస్తాం’ అని పాంటింగ్ స్పష్టం చేశాడు. 

ఇది కూడా చదవండి: T20 World Cup: టీమిండియా కొత్త జెర్సీ వచ్చేసింది.. రెట్రో బ్లూ డ్రెస్సులతో అదరగొడుతున్న భారత క్రికెటర్లు

Rishabh Pant సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్  ఇంతవరకూ IPL Trophy గెలవలేదు. గత సీజన్ లో ట్రోఫీ దగ్గరిదాకా వచ్చినా ఆఖరు  పోరులో ముంబై ఇండియన్స్ చేతిలో అనూహ్య పరాజయం ఎదురుకావడంతో ఆ జట్టుకు నిరాశ తప్పలేదు. కానీ ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే లక్ష్యంతోనే ఢిల్లీ బరిలోకి దిగింది. నేటి మ్యచ్ లో ఓడితే మాత్రం అది కప్ కోసం మరో సీజన్ దాకా వేచి చూడాల్సిందే. 
 

click me!