T20 World Cup 2021: అక్షర్ పటేల్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కి ఛాన్స్... యజ్వేంద్ర చాహాల్‌కి దక్కని చోటు...

By Chinthakindhi RamuFirst Published Oct 13, 2021, 5:21 PM IST
Highlights

స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న శార్దూల్ ఠాకూర్ తుదిజట్టులోకి... టీమ్‌లో ఉన్న అక్షర్ పటేల్ స్టాండ్ బై ప్లేయర్‌గా... ఐపీఎల్ 2021 సీజన్‌లో మంచి పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న చాహాల్‌ను పట్టించుకోని సెలక్టర్లు...

ఐపీఎల్ 2021 ప్రదర్శన ఆధారంగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ప్రకటించిన జట్టులో ఓ మార్పు చేసింది బీసీసీఐ. ఆల్‌రౌండర్‌గా టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపికైన స్పిన్నర్ అక్షర్ పటేల్ స్థానంలో స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న శార్దూల్ ఠాకూర్‌ని తుది 15 మంది జట్టులో కలుపుతూ నిర్ణయం తీసుకుంది.. తుదిజట్టులో ఉన్న అక్షర్ పటేల్‌ను స్టాండ్ బౌ ప్లేయర్‌గా మార్చింది.

 

🚨 NEWS 🚨: Shardul Thakur replaces Axar Patel in 's World Cup squad.

More Details 🔽

— BCCI (@BCCI)

వీరితో పాటు ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆకట్టుకున్న ఆవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, లుక్మన్ మెరివాలా, వెంకటేశ్ అయ్యర్, కర్ణ్ శర్మ, షాబాజ్ అహ్మద్, కృష్ణప్ప గౌతమ్‌లను దుబాయ్‌లోని భారత బయో బబుల్‌లోనే ఉండాల్సిందిగా సూచించింది. వీరు నెట్ బౌలర్లుగా భారత జట్టుకి ప్రిపరేషన్స్‌లో సాయం చేస్తారు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో బాల్‌తో అద్భుతంగా రాణించి 15 వికెట్లు తీసిన అక్షర్ పటేల్, బ్యాటుతో 36 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్‌తో పోలిస్తే బంతితో విఫలమైన రవిచంద్రన్ అశ్విన్‌కి తుది జట్టులో చోటు ఉండదని భావించారు క్రికెట్ విశ్లేషకులు. 

12 మ్యాచుల్లో కేవలం 5 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్‌ అనుభవానికి దృష్టిలో పెట్టుకున్న సెలక్టర్లు, అతన్ని తుదిజట్టులో చోటు కల్పించారు... ఈ ఇద్దరితో పోలిస్తే 15 మ్యాచుల్లో 7.05 ఎకానమీతో 18 వికెట్లు తీసిన యజ్వేంద్ర చాహాల్‌కి టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కుతుందని అందరూ అంచనా వేసినా, అతనికి మాత్రం నిరాశే ఎదురైంది...

15 మ్యచుల్లో 18 వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్, జట్టుకి అవసరమైన సమయాల్లో వికెట్లు తీస్తూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని టీ20 వరల్డ్‌కప్ జట్టులోనే చోటు దక్కించుకున్నాడు. 

click me!