IPL 2021: అతడు చెన్నైకి బాస్.. సీఎస్కే సారథి భవితవ్యంపై దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Oct 05, 2021, 05:03 PM ISTUpdated : Oct 05, 2021, 05:22 PM IST
IPL 2021: అతడు చెన్నైకి బాస్.. సీఎస్కే సారథి భవితవ్యంపై దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు

సారాంశం

Dale steyn: ఒకప్పుడు ధనాధన్ ఆటగాడిగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ నాయకుడు మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుత సీజన్ లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపిస్తున్నా.. బ్యాట్స్మెన్ గా మాత్రం తేలిపోతున్నాడు. తాజాగా సీఎస్కే కెప్టెన్ ఆటపై దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్ (IPL) 14 వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోని (Mahendra Singh Dhoni) కెప్టెన్ గా రాణిస్తున్నా బ్యాట్స్మెన్ గా మాత్రం విఫలమవుతున్నాడు. ఒకప్పుడు జట్టుకు అవసరమైనప్పుడు ఆపద్భాంధవుడిలా ఆదుకునే ధోని.. గత రెండు సీజన్లలో మాత్రం తేలిపోతున్నాడు.  అయితే ఇప్పటికే భారత క్రికెట్ జట్టు నుంచి రిటైరైన ధోని మాత్రం.. సీఎస్కే (CSK) తరఫున కొనసాగుతున్నాడు. మరి తాజా ప్రదర్శనతో తర్వాతి సీజన్ లో అతడు కొనసాగుతాడా..? అనేది ధోని అభిమానుల్లో ఆసక్తి నెలకొన్నది. 

మరీ ముఖ్యంగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ (Dehi Capitals) తో ధోని ప్రదర్శన చూసినవారెవరికైనా ఈ అనుమానం రాకతప్పదు. 27 బంతులాడిన ధోని.. 18 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే విషయమై  ట్విట్టర్ లో ఒక నెటిజన్ దక్షిణాఫ్రికా మాజీ పేసర్ స్టెయిన్ (Dale  Steyn) ను ప్రశ్నించాడు. ‘ధోని ప్రస్తుత ఫామ్ చూస్తే అతడు వచ్చే ఐపీఎల్ సీజన్ లో కొనసాగుతాడని మీరు అనుకుంటున్నారా..?’ అని అడిగాడు. 

ఇది కూడా చదవండి: IPL 2021: ఐపీఎల్ కలిపింది ఈ స్నేహితులని.. జాన్ జిగ్రీ దోస్తులైన క్రికెటర్లు వీళ్లే..

దీనికి స్టెయిన్ సమాధానం చెబుతూ.. ‘ధోని చెన్నైకి బాస్. మీరు చెన్నై గురించి ఆలోచిస్తున్నారంటే ధోని గురించి కూడా ఆలోచిస్తున్నట్టే లెక్క. అంతేగాక మీకు ఇంకో విషయం తెలుసా..? వాళ్ల (సీఎస్కే)కు మరికొన్ని మ్యాచ్ లు మాత్రమే మిగిలున్నాయి. ఆ టీమ్ దాదాపు ఫైనల్ చేరినట్టే. కానీ ధోని ఏమీ ఆడలేదని మీరు అంటున్నారు. ఒకవేళ అతడు ఫైనల్ లో విన్నింగ్ రన్స్ కొడితే.. మళ్లీ సీఎస్కే తరఫున వచ్చే ఏడాది కూడా ధోనిని కొనసాగించాలని మీరే అంటారు’ అని అన్నాడు. 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే