కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీ.. అంపైర్లు ప్రశాంతంగా నిద్రపోతారన్న డివిలియర్స్

By telugu news teamFirst Published Oct 13, 2021, 10:30 AM IST
Highlights

మ్యాచ్ అయిన వెంటనే ఏబీ మైదానంలోనే ఏడ్చేశాడు. ఆపై ట్విట్టర్ వేదికగా అభిమానులను క్షమాపణలు కోరాడు. 'ఆర్‌సీబీ జట్టుకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ట్రోఫీని గెలవనందుకు నన్ను క్షమించండి' అని ఏబీ ట్వీట్ చేశాడు.

IPL 2021 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)  ని దురదృష్టం మరోసారి వెక్కిరించింది. యూఏఈలో రెండో అంచె ఆరంభానికి ముందు RCB Captain గా ఇదే తన చివరి సీజన్‌ అని Virat kohli) ప్రకటించడంతో.. ఈసారి కప్పు గెలిచి తీరాల్సిందే అన్న భావన అభిమానుల్లో కలిగింది. 

అంతేకాదు కొందరు ఆర్‌సీబీ ప్లేయర్స్ కూడా కోహ్లీ కోసమైనా కప్ కొడతామని చెప్పారు. అందులో AB de Villiers కూడా ఉన్నాడు. అయితే షార్జాలో సోమవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచులో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR).. ఆర్‌సీబీని 4 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. 

దాంతో ఆర్‌సీబీ ఐపీఎల్ 2021 నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ అయిన వెంటనే ఏబీ మైదానంలోనే ఏడ్చేశాడు. ఆపై ట్విట్టర్ వేదికగా అభిమానులను క్షమాపణలు కోరాడు. 'ఆర్‌సీబీ జట్టుకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ట్రోఫీని గెలవనందుకు నన్ను క్షమించండి' అని ఏబీ ట్వీట్ చేశాడు.

  కెప్టెన్‌గా కోహ్లీకి ఇదే చివరి సీజన్‌కాగా.. టైటిల్ కల నెరవేరకుండానే అతను కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేయాల్సి వచ్చింది. దాంతో.. ఎలిమినేటర్ మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ చాలా ఎమోషనల్ అయిపోయాడు.

మ్యాచ్ ఓటమి తర్వాత మైదానంలోనే కోహ్లీ కంటతడి పెట్టుకోగా.. అతడ్ని చూసిన ఏబీ డివిలియర్స్ కూడా ఎమోషనల్ అయిపోయాడు. దాంతో.. బెంగళూరు టీమ్‌లోని మిగిలిన ఆటగాళ్లు వారిద్దరిని ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ.. కోహ్లీ మాత్రం ఆ బాధని తట్టుకోలేక అలానే కన్నీటితో డ్రెస్సింగ్ రూముకి వెళ్లిపోయాడు. 

కాగా.. 'విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయర్. ఆర్‌సీబీ జట్టులో మరియు అంతర్జాతీయ స్థాయిలో నీ విజయం కోసం ఎదురుచూస్తున్నాను. జట్టు కోసం నువ్ చేసిన ప్రతిది బాగుంది. అందుకు నీకు ధన్యవాదాలు. కెప్టెన్​గా కోహ్లీ అనగానే గొప్పతనం అనే మాట గుర్తొస్తుంది. అతడు కెప్టెన్​గా జట్టును ముందుండి నడిపించిన తీరు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపింది. ఇది ట్రోఫీని సాధించిన దానికన్నా చాలా ఎక్కువ. కోహ్లీ గొప్పగా ప్రయత్నించాడు. ఇంకా ఈ ఆట ముగియలేదు. నువ్వు మాకోసం చేసిందేది మేం మర్చిపోం. ఈ జ్ఞాపకాలను ఇచ్చినందుకు ధన్యవాదాలు' అని ఏబీ డివిలియర్స్ మరో ట్వీట్ చేశాడు.


విరాట్ కోహ్లీ కెప్టెన్​గా తప్పుకోవడంతో కొందరు అంపైర్లు ఇప్పుడు సంతోషంగా నిద్రపోతారని మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ నవ్వుతూ వ్యాఖ్యానించాడు​. పలు మ్యాచ్​ల్లో అంపైర్లతో కోహ్లీ ఘర్షణలను గుర్తుచేసుకుంటూ ఈ విధంగా మాట్లాడటం గమనార్హం. 

click me!