ఐపీఎల్ 2021: బూట్లు లేకుండా ఆడి... ఏవరీ చేతన్ సకారియా

By telugu teamFirst Published Apr 13, 2021, 8:25 AM IST
Highlights

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచులో మూడు వికెట్లు తీసిన రాజస్థాన్ రాయల్స్ పేసర్ చేతన్ సకారియా అత్యంత పేదరికం నుంచి వచ్చాడు. ఐపిఎల్ మొదటి మ్యాచులోనే సత్తా చాటి అందరి దృష్టినీ ఆకర్షించాడు.

చెన్నై: బూట్లు లేకుండా క్రికెట్ ఆడుతూ వచ్చిన ఓ కుర్రాడు ఐపిఎల్ 2021లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచులో ఆరంగేట్రం చేశాడు. అంతేకాదు, బౌలింగ్ ఆటాక్ ను ప్రారంభించే అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ తరఫున చేతన్ సకారియా అనే కుర్రాడు బౌలింగ్ ను ప్రారంభించాడు. 

తన పేస్, స్వింగ్ తో తొణుకు బెణుకు లేకుండా ప్రత్యర్థులపై బంతితో దాడి చేశాడు. తన రెండో ఓవర్ లోనే మయాంక్ అగర్వాల్ ను పెవిలియన్ కు పంపి తన సత్తా చాటుకున్నాడు. అంతేకాకుండా దూకుడుగా ఆడుతూ పరుగుల వరద పారిస్తూ వచ్చిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ను ఇన్నింగ్సు చివరి ఓవర్లలో అవుట్ చేశఆడు. రిచర్జ్సన్ కూడా అవుట్ చేశాడు. దానికితోడు ఫీల్డింగ్ లోనూ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఓ అద్భుతమైన క్యాచ్ ను అందుకుని ఆశ్చర్యచకితులను చేసాడు. 

ఈ ఏడాది ఐపిఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ చేతన్ సకారియాను 1.2 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. సకారియా ఓ దశలో బూట్లు లేకుండా కూడా క్రికెట్ ఆడాడు. గుజరాత్ రాష్ట్రంోలని రాజ్ కోట్ కు 180 కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామం వార్జెజ్ లో జన్మించాడు ఈ లెఫ్టార్మ్ పేసర్ క్రికెట్ మీద మక్కువతో టెన్నిస్ బంతితో క్రికెట్ ఆడేవాడు. 

తొలుత బ్యాటింగ్ మీదనే దృష్టి పెట్టిన సకారియా ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్ గా మారాడు. 16 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఏ విధమైన శిక్షణ కూడా తీసుకోలేదు. ఆ తర్వాత సౌరాష్ట్ర తరఫున జూనియర్ జట్టులో చేరాడు. కాగా, 17 ఏళ్ల వయస్సులో గాయం కారణంగా ఏడాది పాటు క్రికెట్ కు దూరమయ్యాడు. ఈ సమయంలో కుటుంబ పోషణ కోసం తన మేనమామ వ్యాపారం చూసుకుంటూ క్రికెట్ సాధన చేశాడు.

అనంతరం కూచ్ బెహార్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేశాడు. దాంతో ఎంఆర్ఎఫ్ పేస్ పౌండేషన్ ఆధ్వర్యంలో పేసర్ మేక్ గ్రాత్ వద్ద శిక్షణ పొందే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆ పౌండేషన్ కు వెళ్లే ముందు అతనికి బూట్లు కూడా లేపు. నెట్స్ లో అతని బౌలింగ్ కు మురిసిపోయిన సీనియర్ బ్యాట్స్ మన్ జాక్సన్ జత బూట్లు ఇచ్చాడు. ఆ తర్వాత 2018-19 సీజన్ రంజీల్లో ఆడడం ప్రారంభించాడు. ఇప్పుడు ఐపిఎల్ తొలి మ్యాుచతోనే తానేమిటో చాటుకున్నాడు. 

click me!