ఐపీఎల్ 2021: అందుకే ఓడిపోయామన్న హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్

By telugu teamFirst Published Apr 12, 2021, 10:10 AM IST
Highlights

ఐపిఎల్ 2021లో భాగంగా ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచులో కేకేఆర్ మీద ఓటమి పాలు కావడంపై సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. తాము ప్రణాళికలను సరిగా అమలు చేయలేదని అన్నాడు.

చెన్నై: ఐపిఎల్ 2021లో భాగంగా ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచులో కోల్ కతా నైట్ రైడర్స్ మీద తాము ఓటమి పాలు కావడంపై సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. కేకేఆర్ మీద జరిగిన మ్యాచులో తమ ప్రణాళికలను కచ్చితంగా అమలు చేయకపోవడం వల్లనే ఓటమి పాలయ్యామని ఆయన అన్నాడు. ఇక్కడి పరిస్థితులను బాగా అర్థం చేసుకున్న కేకేఆర్ విజయం సాధించిందని అన్నాడు. 

ఈ పిచ్ మీద పరుగుల వరద పారడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ వికెట్ మీద ఇన్ని పరుగులు వస్తాయని తాను అనుకోలేదని అన్నాడు. తాను అనుకున్నది ఒకటి జరిగింది మరోటి అని వార్నర్ అన్నాడు. కేకేఆర్ జట్టు మంచి బాగస్వామ్యాలను నెలకొల్పిందని అన్నాడు. తాము ప్రణాళికలను సరిగా అమలు చేయలేకపోయామని, ఆరంబం నుంచి చివరి దాకా అదే జరిగిందని అన్నాడు. 

తాము ఆరంభంలో వికెట్లు కోల్పోయినా మనీష్ పాండే, బెయిర్ స్టో మంచి బాగస్వామ్యాలను నెలకొల్పిదని చెప్పాడు. దాంతో తమకు మ్యాచ్ అనుకూలంగా మారిందని భావించామని అన్నాడు. పిచ్ మీద ఉన్న తేమ కాస్తా భిన్నంగా ఉందని, బౌలర్లు ఓవర్ పించ్ బంతులు వేస్తే సులభం హిట్ చేయడం కనిపించిందని అన్నాడు. సీమ్ విభాగంలో తమకన్నా కేకేఆర్ మెరుగ్గా కనిపించిందని అన్నాడు. 

ఈ మ్యాచ్ తాము గెలువాల్సింది, కానీ ఓడిపోయామని, ఇంకా ఈ వేదికపై నాలుగు మ్యాచులు ఉన్నాయని, దాంతో ఇక్కడి మైదానంలో ఎలా ఆడాలనే విషయాన్ని మిగతా మ్యాచుల్లో వాడుకుంటామని చెప్పారు. 

ఎస్ఆర్ హెచ్ మీద జరిగిన మ్యాచులో కేకేఆర్ విజయం పది పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 188 పరుగులను ఛేదించే క్రమంలో హైదరాబాద్ చేతులెత్తేసింది. 

click me!