పంజాబ్ కింగ్స్ జెర్సీ ని ట్రోల్ చేసిన చాహల్

Published : Apr 13, 2021, 08:14 AM ISTUpdated : Apr 13, 2021, 08:36 AM IST
పంజాబ్ కింగ్స్   జెర్సీ ని ట్రోల్ చేసిన చాహల్

సారాంశం

పంజాబ్ కింగ్స్ జట్టు ఈ ఏడాది తమ జట్టు పేరుతోపాటు  తమ జెర్సీని మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వారి కొత్త జెర్సీని చాహల్ ట్రోల్ చేయడం గమనార్హం. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన మైదానంలో ఎలా చెలరేగిపోయి ఆడతాడో అభిమానులకు తెలుసు. అంతేకాదు.. చాహల్ ఎప్పుడూ ఫన్నీగా కూడా ఉంటాడు. సోషల్ మీడియాలో ఏదో ఒక అల్లరి చేస్తూ.. నెటిజన్లను నవ్విస్తూ ఉంటాడు. తోటి క్రికెటర్లను సరదాగా ట్రోల్ చేస్తూ ఉంటాడు. తాజాగా.. చాహల్ తమ సహ ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ ని ట్రోల్ చేశాడు.

పంజాబ్ కింగ్స్ జట్టు ఈ ఏడాది తమ జట్టు పేరుతోపాటు  తమ జెర్సీని మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వారి కొత్త జెర్సీని చాహల్ ట్రోల్ చేయడం గమనార్హం. అయితే.. కొత్తగా పంజాబ్ కింగ్స్ వేసుకున్న జెర్సీ.. దాదాపు ఆర్సీబీని పోలి ఉంది.

ఆ కలర్ కాంబినేషన్ అచ్చం.. బెంగళూరు జట్టుని పోలి ఉంది. దీంతో.. చాహల్ ఆ పాయింట్ పట్టుకొని సోషల్ మీడియాలో ట్రోల్ చేశాడు. కేఎల్ రాహుల్, క్రిస్ గేల్ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసిన చాహల్..  వెల్ కమ్ టూ ఆర్సీబీ అంటూ ట్వీట్ చేసి దానికి కేఎల్ రాహుల్, క్రిస్ గేల్ ని ట్యాగ్ చేయడం గమనార్హం.

 

తమ జెర్సీ లాగే వాళ్ల జెర్సీ కూడా ఉందని చెప్పడానికి చాహల్ అలా ట్రోల్ చేయడం గమనార్హం. కాగా..  చాహల్ చేసిన ట్వీట్ ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. నిన్న జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టు విజయం సాధించింది. 

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు