IPL 2020: అచ్చు అలాగే... సన్‌రైజర్స్ మళ్లీ 2016 హిస్టరీ రిపీట్ చేస్తుందా...

By team teluguFirst Published Sep 27, 2020, 5:02 PM IST
Highlights

అదే ప్రత్యర్థులు, అదే మ్యాచ్‌‌లు... అదే రిజల్ట్... 

2016లాగే మళ్లీ సన్‌రైజర్స్ ఛాంపియన్ అవుతుందని అంచనా వేస్తున్న ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్...

ఐపీఎల్ 2020 సీజన్ 13లో ఆడిన మొదటి రెండు మ్యాచుల్లోనూ చిత్తుగా ఓడింది సన్‌రైజర్స్ హైదరాబాద్. కేన్ విలియంసన్ లేకపోవడం, బౌలర్లు విఫలం కావడంతో రెండు మ్యాచుల్లోనూ పరాజయం పాలైంది వార్నర్ సేన. అయితే సన్‌రైజర్స్ అభిమానులు మాత్రం ఫుల్లు ఖుషీ ఫీల్ అవుతున్నారు. కారణం 2016లో కూడా సేమ్ టు సేమ్ ఇలాగే జరగడం.

2016 మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌ను ఢీకొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్... రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి చేధనలో చిత్తుగా ఓడిపోయింది. ఈ సీజన్‌లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.
అలాగే 2016లో రెండో మ్యాచ్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ను ఢీకొంది సన్‌రైజర్స్. అప్పుడు కూడా మొదట బ్యాటింగ్ చేసి, ప్రత్యర్థి కేకేఆర్‌కి ఈజీగా పరుగులిచ్చి ఓడిపోయింది. ఈ ఏడాది కూడా అదే ప్రత్యర్థి, అదే మ్యాచ్‌... అదే రిజల్ట్...

సో... ఈసారి కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు ఆరెంజ్ ఆర్మీ. 2016లో మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన సన్‌రైజర్స్ ఆ తర్వాత జరిగిన మ్యాచుల్లో 8 విజయాలు సాధించి ఫ్లే ఆఫ్స్ చేరింది.

ఫ్లేఆఫ్స్‌లో కోల్‌కత్తాను, గుజరాత్‌ను చిత్తుగా ఓడించి, ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 8 పరుగుల తేడాతో గెలిచి టైటిల్ విజేతగా నిలిచింది. మరి ఈసారి కూడా సన్‌రైజర్స్ హిస్టరీ రిపీట్ చేస్తుందా? లేదా తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఆగాల్సిందే. 
 

click me!