IPL 2020: ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయిన డి కాక్... రోహిత్ శర్మ ఇచ్చిన ఐడియాతో...

By team teluguFirst Published Oct 17, 2020, 5:54 PM IST
Highlights

జెర్సీకింద బ్లూ ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయిన ముంబై ఇండియన్స్ ఓపెనర్ డి కాక్...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో ఫన్నీ సంఘటన...

IPL 2020 సీజన్‌లోనూ తన రేంజ్ పర్ఫామెన్స్‌తో టేబుల్ టాపర్‌గా నిలిచింది ముంబై ఇండియన్స్. నాలుగుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ నడిపిస్తున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచి, మరోసారి టేబుల్ టాపర్‌గా నిలిచింది ముంబై. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఓ ఫన్నీ సీన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దుబాయ్‌లో ఉన్న ఉక్కపోత కారణంగా ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో వేసుకున్న ప్యాంట్ విప్పి సేదతీరుతుంటారు క్రికెటర్లు. అయితే ఇన్నింగ్స్ ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైందనే ఆతృతలో... ముంబై ఇండియన్స్ జెర్సీకింద బ్లూ ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయాడు ఓపెనర్ డి కాక్. ప్రాక్టీస్‌కి వాడే రెడ్ కలర్ లైన్ ఉన్న ప్యాంట్‌తోనే క్రీజులోకి వచ్చాడు... గ్రౌండ్‌లోకి వచ్చిన తర్వాత విషయాన్ని గుర్తించిన ఆ విషయాన్ని గుర్తించి, ప్యాంట్ మార్చుకునేందుకు హడావుడిగా వెనక్కి వెళ్లాలని ప్రయత్నించాడు.

 

pic.twitter.com/jRM2SJZGNU

— Simran (@CowCorner9)

 

దీన్ని గమనించిన రోహిత్ శర్మ, డి కాక్‌ను చూసి నవ్వేశాడు. అయితే సగం దూరం వెళ్లిన తర్వాత జెర్సీని ఇన్‌షర్ట్ తీసి రెడ్ కలర్ లైన్‌ను కవర్ చేయొచ్చని రోహిత్ శర్మ ఐడియా ఇవ్వడంతో... అదే పని చేశాడు డి కాక్. ఈ మ్యాచ్‌లో 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 78 పరుగులు చేసి అదరగొట్టాడు డి కాక్. ప్రాక్టీస్ ప్యాంట్‌తో మంచి ఇన్నింగ్స్ ఆడడంతో తర్వాత మ్యాచ్ నుంచి డి కాక్ దీన్ని సెంటిమెంట్‌గా మార్చుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు...

click me!