RR vs RCB: స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్... భారీ స్కోరు చేసిన రాజస్థాన్ రాయల్స్...

Published : Oct 17, 2020, 05:15 PM ISTUpdated : Oct 17, 2020, 05:17 PM IST
RR vs RCB: స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్... భారీ స్కోరు చేసిన రాజస్థాన్ రాయల్స్...

సారాంశం

ఓపెనర్‌గా వచ్చి మెరుపులు మెరిపించిన రాబిన్ ఊతప్ప... మళ్లీ ఫెయిల్ అయిన సంజూ శాంసన్... కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్న స్టీవ్ స్మిత్... వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన యజ్వేంద్ర చాహాల్... 4 వికెట్లు తీసిన క్రిస్ మోరిస్...

IPL 2020: టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్... నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. సీజన్‌లో మొదటిసారి ఓపెనర్‌గా వచ్చిన రాబిన్ ఊతప్ప, మంచి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సీజన్‌లో మొట్టమొదటిసారి తొలి వికెట్‌కి 50 పరుగులు జోడించిన బెన్ స్టోక్స్ అవుట్ అయ్యాడు... బెన్ స్టోక్స్ 19 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసి అవుట్ కాగా, రాబిన్ ఊతప్ప 22 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

సంజూ శాంసన్ 9 పరుగులు చేసి మరోసారి నిరాశపరచగా, బట్లర్ 25 బంతుల్లో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరోసారి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 36 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో 57 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ ఆఖరి ఓవర్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ కాగా రాహుల్ తెవాటియా 19 పరుగులు చేశాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో చాహాల్‌కి 2 వికెట్లు దక్కగా, క్రిస్ మోరిస్ 4 వికెట్లు తీశాడు. 

PREV
click me!

Recommended Stories

Cricketers Retirement : రహానే ట్రైలర్ మాత్రమే, సినిమా మిగిలే ఉంది.. రిటైర్మెంట్ కు సిద్దమైన టాప్ 5 క్రికెటర్లు వీళ్లే
Ajinkya Rahane Net Worth: అజింక్య రహానే కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా? లగ్జరీ కార్లు, బిజినెస్ సీక్రెట్స్ ఇవే