IPL 2020 Final: అయ్యర్, రిషబ్ పంత్ పోరాటం... ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ముందు మంచి టార్గెట్...

By team teluguFirst Published Nov 10, 2020, 9:15 PM IST
Highlights

సీజన్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ చేసిన రిషబ్ పంత్...

నాలుగో వికెట్‌కి 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్...

కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న శ్రేయాస్ అయ్యర్...

మూడు వికెట్లు తీసిన ట్రెంట్ బౌల్ట్...

IPL 2020 Final: ఐపీఎల్ కెరీర్‌లో తొలిసారిగా ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్... డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ముందు ఓ మాదిరి టార్గెట్ ఉంచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్... మరోసారి సున్నాకే తొలి వికెట్ కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.

ఓపెనర్‌గా వచ్చిన స్టోయినిస్‌ని ఇన్నింగ్స్ తొలి బంతికే పెవిలియన్ చేర్చాడు ట్రెంట్ బౌల్ట్. అజింకా రహానే 2, శిఖర్ ధావన్ 15 పరుగులు చేసి అవుట్ కావడంతో 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ. అయితే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఢిల్లీని ఆదుకున్నాడు రిషబ్ పంత్.

సీజన్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న రిషబ్ పంత్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేసి అవుట్ కాగా హెట్మయర్ 5, అక్షర్ పటేల్ 9 పరుగులకే అవుట్ అయ్యాడు. 50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు శ్రేయాస్ అయ్యార్  ముంబై ఇండియన్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు తీయగా కౌల్టర్ నీల్, కృనాల్ పాండ్యా తలా ఓ వికెట్ తీశారు.

click me!