IPL 2020 Final: ఐపీఎల్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం... అన్‌అకాడమీ అదిరిపోయే వీడియో!

Published : Nov 10, 2020, 05:50 PM IST
IPL 2020 Final: ఐపీఎల్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం... అన్‌అకాడమీ అదిరిపోయే వీడియో!

సారాంశం

విద్యార్థులారా 2020 సీజన్ గురించి మీరు ఏం నేర్చుకున్నారు... అంటూ ఐపీఎల్ స్పాన్సర్ అన్‌-అకాడమీ అద్భుత వీడియో... వీడియో చాలా బాగుందంటున్న సమంత అక్కినేని, దిశా పటానీ, క్రికెటర్లు, కామెంటేటర్లు...

IPL 2020 సీజన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది. ఆఖరి గ్రూప్ మ్యాచ్ వరకూ ప్లేఆఫ్ ప్లేసులు ఖరారు కాకపోవడం, రికార్డు లెవెల్లో సూపర్ ఓవర్ మ్యాచులు... ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులు... ఐపీఎల్ 2020 సీజన్‌లో హైలెట్స్ ఇవే. మరి విద్యార్థులారా 2020 సీజన్ గురించి మీరు ఏం నేర్చుకున్నారు... అంటూ ఐపీఎల్ స్పాన్సర్ అన్‌-అకాడమీ ఓ అద్భుతమైన వీడియోను రూపొందించింది. 

బౌండరీల లైన్ దగ్గర గాల్లోకి ఎగురుతూ పట్టే క్యాచ్‌ల ద్వారా గ్రావిటీ గురించి, రనౌట్‌ల ద్వారా దూరం, వేగం, సమయం సూత్రాన్ని... ఇలా రకరకాల పాఠాలను, ఫార్ములాలను జత చేస్తూ చేసిన వీడియో అందర్నీ అద్భుతంగా ఆకట్టుకుంటోంది.

హీరోయిన్ సమంత, దిశా పఠానీ దగ్గర్నుంచి క్రికెటర్లు కృనాల్ పాండ్యా, అజింకా రహానే, మహ్మద్ కైఫ్ ఉమేశ్ యాదవ్, ఇర్ఫాన్ పఠాన్, దినేశ్ కార్తీక్, బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్, వీవీఎస్ లక్ష్మణ్,  కామెంటేటర్ హర్షా బోగ్లే వంటి అందరూ ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ అద్భుతంగా ఉందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అన్‌ అకాడమీ చేసిన ఈ వినూత్న ప్రయోగం విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుందని అంటున్నారు విశ్లేషకులు. వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. 

 

 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !