వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌లో కొత్త ఛాంపియన్... సూపర్ నోవాస్‌కి షాక్ ఇచ్చి టైటిల్ గెలిచిన స్మృతి జట్టు...

Published : Nov 09, 2020, 10:57 PM IST
వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌లో కొత్త ఛాంపియన్... సూపర్ నోవాస్‌కి షాక్ ఇచ్చి టైటిల్ గెలిచిన స్మృతి జట్టు...

సారాంశం

30 పరుగులు చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్... వరుస వికెట్లు కోల్పోయి స్వల్ప లక్ష్యాన్ని చేధించలేకపోయిన సూపర్ నోవాస్.. అద్భుత ఫీల్డింగ్, బౌలింగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌కి షాక్ ఇచ్చిన ట్రైయల్ బ్లేజర్స్...

Jio వుమెన్స్ టీ20 ఛాలెంజ్ 2020లో సరికొత్త ఛాంపియన్ అవతరించింది. వరుసగా రెండు సీజన్లలో టైటిల్ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ సూపర్ నోవాస్‌కు లో స్కోరింగ్‌ల ఊహించని షాక్ ఇచ్చింది ట్రైయల్ బ్లేజర్స్. 119 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సూపర్ నోవాస్... వరుస వికెట్లు కోల్పోయి హ్యాట్రిక్ టైటిల్స్ గెలిచే ఛాన్స్ కోల్పోయింది..

మంచి ఫామ్‌లో ఉన్న చమరి ఆటపట్టు 6 పరుగులకే అవుట్ కాగా తానియా భాటియా 14, జెమీమా రోడ్రిగ్స్ 13, శశికళ సిరివర్ధనే 19 పరుగులు చేయగా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 36 బంతుల్లో 2 ఫోర్లు కొట్టి 30 పరుగులు చేసింది. అనుజ పాటిల్ 8, పూజా వస్త్రాకర్ డకౌట్ అయ్యింది.

20 ఓవర్లు కోల్పోయే సరికి 7 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి, 16 పరుగుల తేడాతో ఓడింది సూపర్ నోవాస్. ట్రైయల్ బ్లేజర్స్ బౌలర్లలో సాల్మా కాటున్ 3 వికెట్లు తీయగా దీప్తి శర్మ రెండు వికెట్లు తీసింది. 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !