IPL 2020: సంజూ శాంసన్ క్యాచ్‌పై వివాదం... బంతి నేలను తాకిందా...

Published : Oct 03, 2020, 05:36 PM IST
IPL 2020: సంజూ శాంసన్ క్యాచ్‌పై వివాదం...  బంతి నేలను తాకిందా...

సారాంశం

స్పష్టత లేకున్నా... బ్యాట్స్‌మెన్‌ను అవుట్‌గా ప్రకటించిన థర్డ్ అంపైర్... థర్డ్ క్లాస్ అంపైరింగ్ అంటున్న అభిమానులు... అవుట్‌పై అనుమానాలు వద్దంటున్న మరికొందరు ఫ్యాన్స్...

IPL 2020 సీజన్‌లో మరో వివాదం రేగింది. రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్స్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్‌లో సంజూ శాంసన్ అవుటైన విధానంలో క్లారిటీ లేకపోవడమే ఈ వివాదానికి కారణం... జోస్ బట్లర్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్... వస్తూనే మంచి బౌండరీ బాదాడు. అయితే చాహాల్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ బ్యాట్‌కి తగిలిన బంతి గాల్లోకి లేచింది. వెంటనే డ్రైవ్ చేస్తూ మంచి క్యాచ్ అందుకున్నాడు యజ్వేంద్ర చాహాల్. అయితే క్యాచ్ తీసుకున్నాడా? లేదా? అనే అనుమానంతో థర్డ్ అంపైర్‌కి నివేదించారు అంపైర్లు.

 

 

టీవీ రిప్లైలో చాహాల్ అందుకున్న బంతి నేలకి తాకినట్టు కనిపించలేదు. అలాగే బంతి కింద చాహాల్ వేళ్లు ఉన్నట్టుగా స్పష్టంగా తెలియలేదు. ఇలాంటి సందర్భాల్లో ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద బ్యాట్స్‌మెన్‌కి ఫేవర్‌గా నిర్ణయం వస్తుంది. కానీ అంపైర్ చాహాల్ క్యాచ్‌పై క్లారిటీ ఉన్నట్టుగా ‘సంజూ శాంసన్ అవుట్’ అంటూ ప్రకటించాడు. దీంతో అంపైరింగ్‌పై ట్రోల్స్ వినిపిస్తున్నాయి.

 

 

థర్డ్ క్లాస్ అంపైర్ల కారణంగా ఐపీఎల్ విలువ పడిపోతుందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం చాహాల్ అందుకున్న క్యాచ్‌లో ఎలాంటి డౌట్లు అవసరం లేదని, బంతి కింద చాహాల్ వేళ్లు ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు..

PREV
click me!

Recommended Stories

IPL Brand Value: ఐపీఎల్ జట్లకు బిగ్ షాక్.. సన్‌రైజర్స్, ఆర్సీబీ బ్రాండ్ విలువ ఢమాల్ ! కష్టమేనా?
ICC Rankings : వన్డే కింగ్ ఎవరు? రోహిత్ శర్మకు ఎసరు పెట్టిన విరాట్ కోహ్లీ.. కేవలం 8 పాయింట్లు !