అబ్బబ్బ... ఏం క్రియేటివిటీ తలైవా.. ధోనీని వాడేసిన సైబరాబాద్ పోలీసులు ...

By team teluguFirst Published Oct 3, 2020, 4:31 PM IST
Highlights

ఎక్కవ దూరం డ్రైవింగ్ చేసేటప్పుడు తరచుగా విరామాలు తీసుకోండంటూ ధోనీ పిక్‌ను పోస్ట్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్...

పోలీస్ డిపార్ట్‌మెంట్ క్రియేటివిటీకి నెటిజన్స్ ఫిదా...

IPL 2020లో తొలిసారిగా తన రేంజ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ. భారత జట్టుకు ఎలా ఆడినా, ఐపీఎల్ అంటే చెలరేగిపోయే చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఈ సీజన్‌లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగులు చేసి పోరాడాడు.

అయితే యూఏఈలో ఉన్న ఉక్క వాతావరణంలో చాలాసేపు బ్యాటింగ్ చేయడం వల్ల అలిసిపోయి, ఇబ్బందిపడుతున్నట్టు కనిపించాడు ధోనీ. పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వేసుకుని ధోనీ బ్యాటింగ్ చేశారు. ఈ ఫోటోను ప్రచారం కోసం వాడుకుంది సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ టీమ్.

 

అలసట మీ డ్రైవింగ్ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

ఎక్కువ దూరం డ్రైవింగ్ చేసేటప్పుడు తరచుగా విరామాలు తీసుకోండి. pic.twitter.com/6iTkBycNN3

— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC)

 

‘అలసట మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎక్కవ దూరం డ్రైవింగ్ చేసేటప్పుడు తరచుగా విరామాలు తీసుకోండి’ అంటూ ధోనీ అలసిపోయిన ఫోటోను పోస్టు చేసింది సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ట్విట్టర్ అకౌంట్. వాహనదారుల్లో అవగాహన పెంచేందుకు క్రియేటివ్‌గా ధోనీ ఫోటో వాడేసిన సైబరాబాద్ టీమ్‌కు కామెంట్లతో పొగిడేస్తున్నారు నెటిజన్లు. 

click me!