నేను లేకున్నా....: తన ఫ్యాన్స్ కు క్రిస్ గేల్ ప్రత్యేకమైన సందేశం

Published : Nov 03, 2020, 08:42 AM IST
నేను లేకున్నా....: తన ఫ్యాన్స్ కు క్రిస్ గేల్ ప్రత్యేకమైన సందేశం

సారాంశం

ఐపిఎల్ 2020 సీజన్ లో క్రిస్ గేల్ కథ ముగిసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లే ఆఫ్ అవకాశాన్ని కోల్పోవడంతో ఈ సీజన్ లో ఇక గేల్ ఆడే అవకాశం లేదు. దీంతో ఆయన తన అభిమానులకు ఓ సందేశం ఇచ్చాడు.

అబు దబి: ఐపిఎల్ 2020 సీజన్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ క్రికెటర్ క్రిస్ గేల్ కథ ముగిసింది. ఇక క్రిస్ గేల్ తన సిక్స్ లు, ఫోర్లతో అభిమానులను ఆనందపరిచే అవకాశం లేకుండా పోయింది. ఐపిఎల్ నుంచి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఔటైంది. దాంతో క్రిస్ గేల్ ఈ సీజన్ లో ఇక ఆడడానికి అవకాశం లేదు. 

అయితే, క్రిస్ గేల్ తన అభిమానులకు ట్విట్టర్ వేదికగా ఓ సందేశం ఇచ్చాడు. తాను లేకున్నా కూడా ఐపిఎల్ ను చూడడం కొనసాగించాలని ఆయన అభిమానులను కోరాడు. ఈ సీజన్ లో తన ఆట ముగిసినప్పటికీ ఐపిఎల్ ను చూడడం ఆపొద్దని ఆయన సూచించాడు. 

సీజన్ తొలి అర్థభాగం గేల్ బెంచీకే పరిమితమయ్యాడు. ఆ తర్వాత మైదానంలోకి దిగిన క్రిస్ గేల్ తన ఫోర్లు, సిక్స్ లతో సత్తా చాటుతూ క్రికెట్ ప్రియులను ఆనందపరిచాడు. క్రిస్ గేల్ మైదానంలోకి దిగడం ప్రారంభించిన తర్వాత పంజాబ్ ఏడు మ్యాచులు ఆడింది. ఇందులో ఐదు మ్యాచులు గెలిచింది. 

క్రిస్ గేల్ 288 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్థ సెంచరీలు చేశాడు. ఒక్క పరుగుతో సెంచరీ మిస్సయిన అర్థ సెంచరీ కూడా అందులో ఉంది. పంజాబ్ చివరి రెండు లీగ్ మ్యాచులు ఓడిపోయి ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయింది. 

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు