DCvsRCB: గెలిచి ప్లేఆఫ్ చేరిన యువ ఢిల్లీ... ఓడినా ఆర్‌సీబీకి ప్లేఆఫ్ బెర్త్...

By team teluguFirst Published Nov 2, 2020, 10:52 PM IST
Highlights

మరోసారి హాఫ్ సెంచరీతో మెరిసిన శిఖర్ ధావన్...

సీజన్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ చేసిన అజింకా రహానే...

ప్లేఆఫ్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

రేపటి మ్యాచ్ తర్వాత తేలనున్న కేకేఆర్ భవితవ్యం...

IPL 2020 సీజన్‌లో వరుసగా నాలుగు ఓటముల తర్వాత గ్రూప్ స్టేజ్‌లో ఆఖరి, కీలక మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణించి, వన్ సైడ్ విక్టరీతో ప్లేఆఫ్‌లోకి దూసుకెళ్లింది. కీలక మ్యాచులో ఓడినా ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

153 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్... పృథ్వీషా వికెట్ త్వరగా కోల్పోయింది. పృథ్వీషా 9 పరుగులకే అవుట్ కాగా శిఖర్ ధావన్, అజింకా రహానే కలిసి రెండో వికెట్‌కి 88 పరుగుల భాగస్వామ్యం జోడించారు. శిఖర్ ధావన్ 41 బంతుల్లో 6 ఫోర్లతో 54 పరుగులు చేసి అవుట్ కాగా... అజింకా రహానే సీజన్‌లో మొదటిసారి మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

46 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 60 పరుగులు చేశాడు రహానే. శ్రేయాస్ అయ్యర్‌ 7 పరుగులు చేయగా రిషబ్ పంత్, స్టోయినిస్ పరుగులు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో షాబజ్ అహ్మద్ 2 వికెట్లు తీయగా సిరాజ్, సుందర్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ ఓడినా రన్‌రేట్ కలిసి రావడంతో ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్. క్వాలిఫయర్-1లో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్్ తలబడబోతుండగా... ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌తో కేకేఆర్ తలబడుతుందా? లేక సన్‌రైజర్స్ ఆడుతుందా? అనేది రేపటి మ్యాచ్ ఫలితాన్ని బట్టి నిర్ణయించబడుతుంది.

click me!