DCvsRCB: పడిక్కల్ హాఫ్ సెంచరీ... ఢిల్లీ ముందు ఈ టార్గెట్ సరిపోతుందా?

Published : Nov 02, 2020, 09:06 PM ISTUpdated : Nov 02, 2020, 09:07 PM IST
DCvsRCB: పడిక్కల్ హాఫ్ సెంచరీ... ఢిల్లీ ముందు ఈ టార్గెట్ సరిపోతుందా?

సారాంశం

సీజన్‌లో ఐదో హాఫ్ సెంచరీ బాదిన దేవ్‌దత్ పడిక్కల్... 29 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... 35 పరుగులు చేసిన ఏబీ డివిల్లియర్స్... 3 వికెట్లు తీసిన నోకియా... రబాడాకి రెండు వికెట్లు...  

IPL 2020 ప్లేఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. జోష్ ఫిలిప్ 12 పరుగులు చేసి అవుట్ కాగా కెప్టెన్ విరాట్ కోహ్లీ 24 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్‌తో 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

యంగ్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ సీజన్‌లో ఐదో హాఫ్ సెంచరీ నమోదుచేసుకున్నాడు. ఈ సీజన్‌లో కెఎల్ రాహుల్, పడిక్కల్ మాత్రమే ఐదేసి హాఫ్ సెంచరీలు బాదారు. 41 బంతుల్లో 5 ఫోర్లతో 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు దేవ్‌దత్ పడిక్కల్. క్రిస్ మోరిస్ డకౌట్ కాగా...శివమ్ దూబే 17 పరుగులు చేశాడు. ఏబీ డివిల్లియర్స్ 21 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో నోకియాకి మూడు వికెట్లు దక్కగా రబాడాకి రెండు, రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ తీశాడు. 

PREV
click me!

Recommended Stories

T20 World Cup : వన్ మ్యాన్ ఆర్మీ కోహ్లీ నుంచి హిట్‌మ్యాన్ రోహిత్ దాకా.. ఈ లిస్ట్ చూస్తే గూస్‌బంప్స్ పక్కా !
Ravindra Jadeja : గెలిస్తే కింగ్.. లేదంటే ఇంటికే ! స్టార్ ప్లేయర్ కు బిగ్ టెస్ట్