INDvsENG 3rd Test: హమ్మయ్య... వికెట్ పడింది! తొలి వికెట్ తీసిన మహ్మద్ షమీ...

By Chinthakindhi RamuFirst Published Aug 26, 2021, 4:25 PM IST
Highlights

135 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు... టీమిండియాకి తొలి బ్రేక్ అందించిన మహ్మద్ షమీ, తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశగా ఆతిథ్య జట్టు...

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు ఎట్టకేలకు 50వ ఓవర్‌లో వికెట్ తీయగలిగింది. మొదటి వికెట్‌కి 135 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన ఇంగ్లాండ్ ఓపెనర్ రోరీ బర్న్స్‌ను మహ్మద్ షమీ క్లీన్‌బౌల్డ్ చేశాడు...

153 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 61 పరుగులు చేసిన రోరీ బర్న్స్, సిరీస్‌లో హైయెస్ట్ స్కోరు నమోదుచేసి పెవిలియన్ చేరాడు. మహ్మద్ షమీకి రోరీ బర్న్స్ వికెట్ విదేశాల్లో 130వ వికెట్. అనిల్ కుంబ్లే, కపిల్‌దేవ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, హర్భజన్ సింగ్ తర్వాత విదేశాల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు మహ్మద్ షమీ..

షమీ అవుటయ్యే సమయానికి ఇంగ్లాండ్ జట్టు, తొలి ఇన్నింగ్స్‌లో 57 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో ఇంకా 9 వికెట్లు ఉండడంతో ఇంగ్లాండ్‌కి మొదటి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా  తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.  

భారత ఇన్నింగ్స్‌లో ఏ బ్యాట్స్‌మెన్ కూడా 20 పరుగుల మార్కు అందుకోలేకపోయారు. భారత ఓపెనర్ రోహిత్ శర్మ 105 బంతుల్లో ఓ ఫోర్‌తో 19 పరుగులు చేయగా, అజింకా రహానే 18 పరుగులు చేశాడు. మిగిలిన ఎవ్వరూ రెండంకెల స్కోరును కూడా అందుకోలేకపోయారు.

click me!