Ind vs Eng: మరోసారి సిరాజ్ పై జాతి వివక్ష..!

Published : Aug 26, 2021, 11:34 AM IST
Ind vs Eng: మరోసారి సిరాజ్ పై జాతి వివక్ష..!

సారాంశం

ఇంగ్లాండ్ ప్రేక్షకులు.. సిరాజ్ పట్ల ప్రవర్తించిన తీరును వివరించాడు. అందుకే కోహ్లీ కూడా అలా సీరియస్ అయ్యాడని పంత్ పేర్కొన్నాడు. కాగా.. ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. 

ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ జరుగుతున్న సమయంలో.. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ జాతి వివక్ష ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా.. అదే సీన్ ఇంగ్లాండ్ లో రిపీట్ అయ్యింది. సిరాజ్ పట్ల.. ఇంగ్లాండ్ క్రీడాభిమానులు దారుణంగా ప్రవర్తించారు. దీంతో.. వారిపై కోహ్లీ మండిపడ్డారు.

ఇంతకీ మ్యాటరేంటంటే.. లార్డ్స్ లో.. టీమిండియా సెకండ్ టెస్టు విజయం సాధించడానికి సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో మూడో టెస్టులో సిరాజ్ పట్ల ఇంగ్లాండ్ ప్రేక్షకులు దారుణంగా ప్రవర్తించారు.  సిరాజ్ పై బాల్ విసిరారు. దీంతో.. ఈ ఘటనపై కోహ్లీ సీరియస్ అయ్యాడు. దానిని  మళ్లీ వారిపై విసిరివేయమంటూ  కోహ్లీ.. సిరాజ్ కి సూచించడం గమనార్హం. కోహ్లీ.. అలా సిరాజ్ కి చెప్పడం... టీవీల్లో రికార్డు అయ్యింది.

కాగా.. ఈ విషయంపై పంత్  వివరణ ఇచ్చాడు. ఇంగ్లాండ్ ప్రేక్షకులు.. సిరాజ్ పట్ల ప్రవర్తించిన తీరును వివరించాడు. అందుకే కోహ్లీ కూడా అలా సీరియస్ అయ్యాడని పంత్ పేర్కొన్నాడు. కాగా.. ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. 

 

ఇదిలా ఉండగా... మూడో టెస్టులో  టీమిండియా ఘోరంగా విఫలమైంది. కేవలం 78 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. ఇక ఇంగ్లాండ్ కేవలం ఒక వికెట్  కోల్పోయి.. 120 పరుగులతో విజయం సాధించింది. 
 

PREV
click me!

Recommended Stories

RR vs CSK : ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ఘోర ఓటమి.. అసలు కారణం ఇదే
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన వైభవ్ సూర్యవంశీ