Ind vs Eng: కోహ్లీ కి రిటైర్మెంట్ టైమ్ దగ్గరపడిందా..?

By telugu news teamFirst Published Aug 26, 2021, 12:00 PM IST
Highlights

అండర్సన్‌ను ఎదుర్కోవడంలో కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. కాగా.. కోహ్లీ... ఈ టెస్టు సిరీస్ లో ఫెయిల్ అవ్వడంపై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి.
 

టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కోసం తలపడుతున్న సంగతి తెలిసిందే. కాగా. గురువారం జరిగిన మూడో టెస్టు మ్యాచ్ లో ఘోర ఓటమి చవిచూసింది.  ఇంగ్లండ్ పేస్ బౌల‌ర్ జేమ్స్ అండర్సన్‌ చెల‌రేగ‌డంతో 21 ప‌రుగుల‌కే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ (0), టెస్ట్ స్పెసలిస్ట్ బ్యాట్స్‌మన్‌ చేతేశ్వర్ పుజారా (1), కెప్టెన్ విరాట్ కోహ్లీ (7) దారుణంగా విఫ‌ల‌మయ్యారు. ఈ మూడు వికెట్లూ అండర్సన్‌ ఖాతాలోకే వెళ్లాయి.

జిమ్మీ ఆరు ఓవ‌ర్ల‌లో ఆరు ప‌రుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. అండర్సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 10.5 ఓవర్‌కు విరాట్ కోహ్లీ ఔట్ అయ్యాడు. కోహ్లీ కీపర్‌ బట్లర్‌కి క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో అండర్సన్‌ను ఎదుర్కోవడంలో కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. కాగా.. కోహ్లీ... ఈ టెస్టు సిరీస్ లో ఫెయిల్ అవ్వడంపై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి.

Thank you Kohli, happy retirement life pic.twitter.com/2H6fRMEI0P

— Ctrl C + Ctrl Memes🇮🇳 (@Ctrlmemes_)

ఇక కోహ్లీకి రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేయడం గమనార్హం. హ్యాపీ రిటైర్మెంట్  కోహ్లీ అంటూ.. ట్వీట్స్ చేస్తున్నారు.  మైదానంలో ఇంగ్లాండ్ ప్రేక్షకులు కూడా గుడ్ బై కోహ్లీ, రిటైర్మెంట్ ప్రకటించు అంటూ అరవడం గమనార్హం. మ్యాచ్ ఓటమి తర్వాత ఇండియన్ అభిమానులు సైతం ఇదే రకం ట్వీట్లు చేస్తుండటం గమనార్హం. మరి ఈ కామెంట్స్ పై కోహ్లీ ఎలా స్పందిస్తాడో చూడాలి. 

 

click me!