INDvsAUS 3rd ODI: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా... క్లీన్ స్వీప్ లక్ష్యంగా టీమిండియా..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. ఐదు మార్పులతో ఆసీస్, 3 మార్పులతో భారత్.. 

INDvsAUS 3rd ODI: Australia won the toss and elected to bat first, Team India aiming CRA

రాజ్‌కోట్‌లో టీమిండియాతో జరుగుతున్న ఆఖరి వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా, బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రెండు మ్యాచులకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ నేటి మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే తొలి రెండు వన్డేలు గెలిచిన భారత జట్టు 2-0 తేడాతో వన్డే సిరీస్ గెలిచింది. నేటి మ్యాచ్‌లో గెలిస్తే, సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తుంది. ఇప్పటివరకూ ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేయలేకపోయింది భారత జట్టు...
 

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు ఈ వన్డే మ్యాచ్ గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది ఆస్ట్రేలియా. నేటి మ్యాచ్‌లో ఏకంగా ఐదు మార్పులతో బరిలో దిగుతోంది ఆస్ట్రేలియా. రెండో వన్డేకు దూరంగా ఉన్న మిచెల్ మార్ష్, ప్యాట్ కమ్మిన్స్.. ఆఖరి వన్డేలో ఆడుతున్నారు. అలాగే తన్వీర్ సంఘా నేటి మ్యాచ్ ద్వారా ఆరంగ్రేటం చేస్తున్నాడు. 

Latest Videos

ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, ప్యాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, తన్వీర్ సంఘా, జోష్ హజల్‌వుడ్

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ 

vuukle one pixel image
click me!