ఆఖరి వన్డేలో శార్దూల్ ఠాకూర్, శుబ్‌మన్ గిల్‌కి రెస్ట్... అక్షర్ పటేల్ అవుట్! సీనియర్ల రాకతో...

గాయంతో మూడో వన్డే నుంచి దూరమైన అక్షర్ పటేల్... శుబ్‌మన్ గిల్, శార్దూల్ ఠాకూర్‌కి రెస్ట్.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా రీఎంట్రీ.. 

Shubman gill, Shardul thakur rested, Axar patel ruled out from Rajkot ODI, India vs Australia CRA

ఆస్ట్రేలియాతో మొదటి రెండు వన్డేలు గెలిచి 2-0 తేడాతో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది భారత జట్టు. రాజ్‌కోట్ వేదికగా ఇండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. 

గాయంతో మొదటి రెండు వన్డేలకు దూరమైన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, మూడో వన్డేలో ఆడే అవకాశం ఉందని సెలక్టర్లు.. టీమ్ సెలక్షన్ సమయంలో ప్రకటించారు. అయితే అక్షర్ పటేల్ ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో రాజ్‌కోట్ వన్డేకి కూడా దూరమయ్యాడు..

Latest Videos

అక్షర్ పటేల్ టీమ్‌కి దూరం కావడంతో మొదటి రెండు వన్డేల్లో ఆడిన రవిచంద్రన్ అశ్విన్, మూడో వన్డేలో కూడా ఆడే అవకాశాలు ఉన్నాయి. వరల్డ్ కప్ వార్మప్ మ్యాచుల సమయానికి అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకోకపోతే అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్, ప్రపంచ కప్ ఆడే ఛాన్స్ కొట్టేస్తాడు..

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా రీఎంట్రీ ఇవ్వడంతో తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా మారనుంది. మొదటి రెండు వన్డేల్లో శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఆసియా క్రీడల కోసం చైనా బయలుదేరబోతున్నాడు. అలాగే మూడో వన్డేలో శుబ్‌మన్ గిల్‌కి రెస్ట్ ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది..

ఇప్పటికే మొదటి వన్డేలో 77, రెండో వన్డేలో 105 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. ఫామ్‌ని నిరూపించుకున్నాడు. ఐసీసీ నెం.1 వన్డే బ్యాటర్‌గా నిలవబోతున్నాడు. మూడో వన్డేలో ఫెయిల్ అయితే అతను మళ్లీ నెం.2 స్థానానికి పడిపోవచ్చు. అదీకాకుండా వరుసగా మ్యాచులు ఆడుతున్న శుబ్‌మన్ గిల్‌కి విశ్రాంతి అవసరమని మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది..

అలాగే పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా మూడో వన్డేలో ఆడడం లేదు. భారీగా పరుగులు సమర్పిస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న శార్దూల్ ఠాకూర్, వరల్డ్ కప్ తుది జట్టులో చోటు దక్కించుకోవడం అనుమానమే..  ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత సెప్టెంబర్ 30న గౌహతిలో ఇంగ్లాండ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది టీమిండియా. అక్టోబర్ 3న తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌తో రెండో వార్మప్ మ్యాచ్ ఆడే భారత జట్టు, వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్ ఆడుతుంది. 

vuukle one pixel image
click me!