#indvsaus first test:ఆసిస్ తో తలపడే భారత జట్టిదే... వారిద్దరికి మొండిచేయి

By Arun Kumar PFirst Published Dec 16, 2020, 4:34 PM IST
Highlights

రేపటి(గురువారం) నుండి కంగారు జట్టుతో వారి గడ్డపైనే టెస్ట్ సీరిస్ ప్రారంభంకానుండగా ఇవాళ(బుధవారం) భారత జట్టును ప్రకటించింది బిసిసిఐ. 

న్యూడిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఇప్పటికే వన్డే, టీ20 సీరిస్ లు ముగించుకున్న టీమిండియా టెస్ట్ సీరిస్ కు సిద్దమైంది. రేపటి(గురువారం) నుండి ఆసిస్తో టెస్ట్ సీరిస్ ప్రారంభంకానుండగా ఇవాళ(బుధవారం) భారత జట్టును ప్రకటించింది బిసిసిఐ. అయితే వార్మప్‌ మ్యాచ్‌ల్లో రాణించిన రిషభ్‌ పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌ కు తుది జట్టులో చోటు దక్కలేదు. వీరి స్థానంలో వృద్ధిమాన్‌ సాహా, పృథ్వీ షా చోటు దక్కించుకున్నారు. డే అండ్‌ నైట్ టెస్టు కావడం, పింక్‌ బాల్‌తో ఆట జరుగనుండటంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 

బౌలర్ల విషయానికి వస్తే చాలారోజులు జట్టుకు దూరమైన స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌కు మరోసారి అవకాశమిచ్చారు. అలాగే ఆల్‌రౌండర్లు కుల్దీప్‌ యాదవ్‌​, రవీంద్ర జడేజా తొలి టెస్ట్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమీ, జస్ప్రీత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌‌ కు తుది జట్టులో చోటు దక్కింది.   
 
భారత జట్టు తరపున ఓపెనింగ్ చేసే అవకాశం చతేశ్వర్‌ పుజారా, పృథ్వీ షా లకు దక్కింది. వృద్ధిమాన్‌ సాహా వికెట్‌ కీపర్‌ గా వ్యవహరించనున్నాడు. మొదటి మ్యాచ్‌ తర్వాత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి జట్టుకు దూరమవనుండగా అజింక్యా రహానే కెప్టెన్‌గా వ్యవరించనున్నాడు. 

టీమిండియా తుది జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, చతేశ్వర్ పూజారా, అజింక్య రహానె, హనుమా విహారీ, వృద్ధిమాన్ సాహా (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్, ఉమేష్
యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ సింగ్ బుమ్రా.
 

click me!