మళ్లీ మైదనాంలోకి అడుగుపెడుతున్న శ్రీశాంత్..!

By telugu news teamFirst Published Dec 16, 2020, 1:59 PM IST
Highlights

ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న 37 ఏండ్ల శ్రీశాంత్‌పై బీసీసీఐ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అతనిపై బ్యాన్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసింది. 

టీమిండియా సీనియర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఎస్‌.శ్రీశాంత్‌ మళ్లీ పోటీ క్రికెట్‌ బరిలో దిగాడు.  రాబోయే దేశవాళీ టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టీ20 టోర్నమెంట్‌లో అతడు ఆడాలని ఉత్సాహంగా ఉన్నాడు. టీ20 టోర్నీ జనవరి 2న ప్రారంభంకానుంది.   

కేరళ క్రికెట్‌ సంఘం ఎంపిక చేసిన 26 మంది సభ్యుల  ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకోవడంతో అతడు పోటీ క్రికెట్‌లోకి వచ్చాడు.  ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న 37 ఏండ్ల శ్రీశాంత్‌పై బీసీసీఐ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అతనిపై బ్యాన్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసింది. 

సంజూ శాంసన్‌, సచిన్‌ బేబీ, జలజ్‌ సక్సేనా, రాబిన్‌ ఉతప్ప, బసిల్‌ థంపీ తదితరులు కేరళ జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. 2011లో చివరిసారిగా భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన పేసర్‌ డిసెంబర్‌ 20 నుంచి 30 వరకు జరగబోయే సన్నాహక శిబిరంలో శ్రీశాంత్‌ పాల్గొననున్నాడు. 2007 వరల్డ్‌ టీ20, 2011 ప్రపంచకప్‌ గెలిచిన జట్లలో శ్రీశాంత్‌ ఉన్నాడు. 

click me!