నేనేమైనా దీపికా పదుకునేనా నన్ను చూపిస్తావ్..! టీవీ స్క్రీన్‌ను చూపించు..!! రోహిత్ రియాక్షన్ వైరల్

Published : Feb 12, 2023, 10:37 AM IST
నేనేమైనా దీపికా పదుకునేనా నన్ను చూపిస్తావ్..! టీవీ స్క్రీన్‌ను  చూపించు..!! రోహిత్ రియాక్షన్ వైరల్

సారాంశం

INDvsAUS: ఇండియా - ఆస్ట్రేలియా మధ్య  నాగ్‌పూర్ వేదికగా  ముగిసిన తొలి టెస్టులో  భారత్ ఘన విజయాన్ని అందుకుంది.   ఈ మ్యాచ్ లో  రెండో ఇన్నింగ్స్ లో భారత స్పిన్నర్ల ధాటికి ఆసీస్ నిలువలేకపోయారు. 

నాగ్‌పూర్ టెస్టులో భాగంగా మూడో రోజు ఆటలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.  బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా  జరిగిన  ఈమ్యాచ్ లో  టీమిండియా సారథి రోహిత్ శర్మ తనను  టీవీ స్క్రీన్ లో చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. డీఆర్ఎస్ రివ్యూ కోరినప్పుడు  అందుకు సంబంధించిన వీడియోను చూపాలి గానీ  నన్ను  చూపిస్తావేంటి..? అన్నట్టుగా రియాక్షన్ ఇచ్చాడు.   ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైలర్ అవుతోంది. 

ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.  డేవిడ్ వార్నర్ నిష్క్రమించడంతో   ఆసీస్ బ్యాటర్ హ్యాండ్స్‌కాంబ్ బ్యాటింగ్ కు వచ్చాడు.  వచ్చీ రాగానే అశ్విన్.. అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 18వ ఓవర్లో  రెండో బంతికి హ్యాండ్స్‌కాంబ్  ప్యాడ్స్ కు తాకింది. 

అయితే అశ్విన్ తో పాటు టీమిండియా ఆటగాళ్లంతా  అప్పీల్ చేసినా అంపైర్ అవుట్ ఇవ్వలేదు.  కానీ   అంపైర్ మాత్రం  అవుట్ ఇవ్వలేదు.  దీంతో రోహిత్ రివ్యూ కోరాడు.  ఆ సమయంలో   కెమెరామెన్.. రివ్యూకు సంబంధించిన పుటేజీని చూపకుండా   కెమెరాను రోహిత్ తో పాటు టీమిండియా ఆటగాళ్ల మీదకు చూపాడు.  అవే విజువల్స్   బిగ్ స్క్రీన్ పై  రిఫ్లెక్ట్ అయ్యాయి. దీంతో  చిర్రెత్తుకొచ్చిన  హిట్‌మ్యాన్.. ‘అరె నన్నేం చూపిస్తావ్.. నా ముఖంలో ఏముంది. బిగ్ స్క్రీన్ ను చూపించు..’అన్నాడు. అప్పుడే  రోహిత్ వెనకాల ఉన్న   సూర్యతో పాటు అశ్విన్, భరత్ లు  పడీ పడీ నవ్వారు. దీంతో దెబ్బకు జడుసుకున్న  కెమెరామెన్ అప్పటికప్పుడే  కెమెరాను బిగ్ స్క్రీన్   వైపునకు మళ్లించాడు.   

 

ఇక ఈ టెస్టులో కంగారూలను కంగారెత్తించిన  టీమిండియా స్పిన్ త్రయం.. నాగ్‌పూర్ టెస్టులో భారత్ కు తిరుగులేని విజయాన్ని అందించింది.  ఈ మ్యాచ్ లో  తొలి ఇన్నింగ్స్ లో భారత్.. ఆసీస్ ముందు 223 పరుగుల ఆధిక్యాన్ని నిలిపింది. కానీ అందులో  సగం కూడా   చేయకుండానే  ఆసీస్ చేతులెత్తేసింది.  పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుండటంతో  కెప్టెన్ రోహిత్ శర్మ.. రెండో ఓవర్లోనే   అశ్విన్ కు బంతినిచ్చాడు.  రోహిత్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా  కంగారూలకు చుక్కలు చూపించాడు.  12 ఓవర్లే వేసిన  అశ్విన్ ఐదు వికెట్లు తీయగా  జడేజాకు రెండు, షమీకి రెండు వికెట్లు దక్కాయి. అక్షర్ పటేల్ ఓ వికెట్ తీశాడు.  

సంక్షిప్త స్కోర్లు : 

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 177 ఆలౌట్ 
భారత్ తొలి ఇన్నింగ్స్ :  400 ఆలౌట్  
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ :  91 ఆలౌట్ 
ఫలితం : ఇన్నింగ్స్ 132  పరుగుల తేడాతో భారత్ ఘన విజయం 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఒకే ఏడాదిలో మూడు టీ20 సెంచరీలు.. బుడ్డోడా నువ్వు కేక అసలు.. నెక్స్ట్ టీమిండియాకే
IND vs SA : వైజాగ్‌లో దబిడి దిబిడే.. భారత్‌ జట్టులో భారీ మార్పులు.. పిచ్ రిపోర్టు ఇదే