మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్, ఇంగ్లాండ్ శుభారంభం.. కివీస్, విండీస్ లకు భంగపాటు

Published : Feb 12, 2023, 09:33 AM IST
మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్, ఇంగ్లాండ్ శుభారంభం..  కివీస్, విండీస్ లకు భంగపాటు

సారాంశం

Womens World Cup 2023: మహిళల టీ20 ప్రపంచకప్ లో  ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లు శుభారంభం  చేశాయి.  నిన్న జరిగిన లీగ్ మ్యాచ్ లలో ఆసీస్.. న్యూజిలాండ్ ను ఓడించగా  ఇంగ్లాండ్ విండీస్ పై నెగ్గింది. 

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా,  మాజీ వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ లు శుభారంభం చేశాయి.   నిన్న జరిగిన లీగ్ పోటీలలో ఈ రెండు జట్లు తమ ప్రత్యర్థులపై ఘన విజయాన్ని అందుకున్నాయి.  ఆస్ట్రేలియా.. తమ ప్రత్యర్థి  న్యూజిలాండ్ పై 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.  ఇంగ్లాండ్.. విండీస్ పై  7 వికెట్ల తేడాతో  ఈజీ విక్టరీ కొట్టింది.  ఫలితంగా లీగ్ దశలో  ఈ రెండు జట్లూ ముందడుగు వేశాయి. 

గ్రూప్ - బిలో ఉన్న వెస్టిండీస్ - ఇంగ్లాండ్ మధ్య   పార్ల్ లోని బొలాండ్ పార్క్ వేదికగా మ్యాచ్ జరిగింది.  ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ మహిళల జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు  7 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేసింది.   

విండీస్ టీమ్ లో  కెప్టెన్ హేలీ  మాథ్యూస్   (42) టాప్ స్కోరర్. వన్ డౌన్ లో వచ్చిన  క్యాంప్బెల్లె (34) రాణించింది. మిగిలిన బ్యాటర్లందరూ విఫలం కావడంతో  కరేబియన్ టీమ్  135 వద్దే పరిమితమైంది. స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లాండ్  ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్ సోఫియా డంక్లీ (18 బంతుల్లో 34, 4 ఫోర్లు, 1 సిక్స్)  తో పాటు నటాలియా సీవర్  (30 బంతుల్లో 40 నాటౌట్, 6 ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ హెథర్  నైట్ (22 బంతుల్లో 32 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్స్) లు  ధనాధన్ ఆటతో  14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. 

 

కివీస్ పై ఆసీస్ ఆల్ రౌండ్ షో.. 

ఆసీస్ - కివీస్ మ్యాచ్ లో  టాస్ గెలిచిన  న్యూజిలాండ్  ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్ మూనీ  డకౌట్ అయినా కెప్టెన్ హీలి (38 బంతుల్లో 55, 9 ఫోర్లు), కెప్టెన్ మెక్ లానింగ్ (33 బంతుల్లో 41, 7 ఫోర్లు) రాణించారు.   ఎల్లీస్ పెర్రీ (22 బంతుల్లో 40, 3 ఫోర్లు, 2 సిక్సర్లు)  ధాటిగా ఆడింది. ఫలితంగా ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 

లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్.. 14 ఓవర్లలోనే  76 పరుగులు చేసి కుప్పకూలింది.   ఆ జట్టులో అమేలియా కెర్ (21) టాప్ స్కోరర్. ఆసీస్ బౌలింగ్ ధాటికి   కివీస్ జట్టులో  ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరారు. వారిలో ముగ్గురు డకౌట్ అయ్యారు. ఆసీస్ బౌలర  ఆష్లే గార్డ్‌నర్ కు  ఐదు వికెట్లు దక్కాయి. మూడు ఓవర్లు  వేసిన ఆమె.. 12 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టింది. 

 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !