INDvsAUS 1st ODI: 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా.. హాఫ్ సెంచరీ చేసి అవుటైన రుతురాజ్, అయ్యర్ ఫ్లాప్..

By Chinthakindhi Ramu  |  First Published Sep 22, 2023, 7:49 PM IST

తొలి వికెట్‌కి 142 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన  రుతురాజ్ గైక్వాడ్- శుబ్‌మన్ గిల్.. హాఫ్ సెంచరీ చేసి అవుటైన రుతురాజ్ గైక్వాడ్.. 


మొహాలీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు, తొలి వికెట్ కోల్పోయింది. 277 పరుగుల భారీ లక్ష్యఛేదనలో టీమిండియాకి అదిరిపోయే ఆరంభం అందించారు ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్. ఈ ఇద్దరూ దూకుడుగా ఆడుతూ మొదటి ఓవర్‌ నుంచి ఆసీస్ బౌలర్లపై కౌంటర్ అటాక్ చేశారు..

తొలి వికెట్‌కి 142 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయ్యాడు. 77 బంతుల్లో 10 ఫోర్లతో 71 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, వన్డే ఫార్మాట్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు గైక్వాడ్. 

Latest Videos

undefined

ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టుకి కెప్టెన్సీ చేయబోతున్న రుతురాజ్ గైక్వాడ్‌కి ఈ హాఫ్ సెంచరీ, మంచి ఎనర్జీని ఇవ్వొచ్చు. మరో ఎండ్‌లో శుబ్‌మన్ గిల్, తన ఫామ్‌ని కొనసాగించాడు.  మాథ్యూ షార్ట్ బౌలింగ్‌లో వరుసగా 4, 6 బాది 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు శుబ్‌మన్ గిల్.. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 8 బంతులు ఆడి 3 పరుగులకే అవుట్ అయ్యాడు. లేని పరుగు కోసం ప్రయత్నించి, శ్రేయాస్ అయ్యర్ రనౌట్ అయ్యాడు. 

 అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, సరిగ్గా 50 ఓవర్లలో 276 పరుగులకి ఆలౌట్ అయ్యింది. భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ 10 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 51 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. జస్ప్రిత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాకి తలా ఓ వికెట్ దక్కింది..

డేవిడ్ వార్నర్ 52 పరుగులు చేయగా జోష్ ఇంగ్లీష్ 45, స్టీవ్ స్మిత్ 41, మార్నస్ లబుషేన్ 39, కామెరూన్ గ్రీన్ 31, మార్కస్ స్టోయినిస్ 29, ప్యాట్ కమ్మిన్స్ 21 పరుగులు చేశారు. 

click me!