ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో టీమిండియాతో మ్యాచ్‌లో గాయపడిన నసీం షా.... వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మొత్తానికి దూరం! నసీం షా ప్లేస్‌లో హసన్ ఆలీకి చోటు..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైపోయింది. ఇప్పటికే ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్.. వరల్డ్ కప్ ఆడే జట్లను ప్రకటించాయి. తాజాగా పాకిస్తాన్ కూడా వరల్డ్ కప్ జట్టును ప్రకటించింది..
ఆసియా కప్ 2023 టోర్నీలో అట్టర్ ఫ్లాప్ అయిన ఆల్‌రౌండర్ షాదబ్ ఖాన్‌కి వన్డే ప్రపంచ కప్‌లో చోటు దక్కకపోవచ్చని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాలన్నీ ఉట్టి పుకార్లేనని తేల్చేస్తూ షాదబ్ ఖాన్‌ని, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి వైస్ కెప్టెన్‌గా ప్రకటించింది పాక్ క్రికెట్ బోర్డు..
ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో టీమిండియాతో మ్యాచ్‌లో గాయపడిన నసీం షా, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. తొలి సగం ముగిసిన తర్వాత నసీం షా, జట్టుతో కలిసే అవకాశం ఉందని వార్తలు వచ్చినా.. పీసీబీ మాత్రం అతన్ని పూర్తిగా పక్కనబెట్టేసింది.
నసీం షా ప్లేస్‌లో సీనియర్ ఆల్‌రౌండర్ హసన్ ఆలీకి చోటు దక్కింది. 2022 జూన్‌లో ఆఖరి వన్డే మ్యాచ్ ఆడిన హసన్ ఆలీ, ఇప్పటిదాకా 60 వన్డేల్లో 91 వికెట్లు తీశాడు. ఇండియాతో సూపర్ 4 మ్యాచ్‌లోనే గాయపడిన మరో పాక్ పేసర్ హారీస్ రౌఫ్ మాత్రం గాయం నుంచి కోలుకుని, వన్డే వరల్డ్ కప్ 2023 జట్టులో చోటు దక్కించుకున్నాడు..
పాక్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఫహీం ఆష్రఫ్‌కి, వన్డే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు. శ్రీలంకతో మ్యాచ్‌లో హారీస్ రౌఫ్ ప్లేస్‌లో ఆడిన జమాన్ ఖాన్, నసీం షా ప్లేస్‌లో ఆడిన మహ్మద్ హారీస్‌లకు ట్రావిలింగ్ రిజర్వులుగా వరల్డ్ కప్ కోసం ఇండియాకి రాబోతున్నారు.
ఆసియా కప్ టోర్నీలో ఫెయిల్ అయిన పాక్ ఓపెనర్ ఫకార్ జమాన్‌కి వన్డే వరల్డ్ కప్ జట్టులో చోటు ఇచ్చిన సెలక్టర్లు, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, సౌద్ షకీల్, ఆఘా సల్మాన్‌లకు ప్రపంచ కప్ టీమ్‌లో చోటు కల్పించారు..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం పాకిస్తాన్ జట్టు: ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ ఆలీ అఘా, షాదబ్ ఖాన్, ఉసమా మిర్, మహ్మద్ నవాజ్, షాహీన్ షా ఆఫ్రిదీ, హారీస్ రౌఫ్, మహ్మద్ వసీం జూనియర్, హసన్ ఆలీ
ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లు: అబ్రర్ అహ్మద్, జమాన్ ఖాన్, మహ్మద్ హారీస్