నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకి ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా.. 5 వికెట్లు తీసిన మహ్మద్ షమీ... హాఫ్ సెంచరీ చేసిన డేవిడ్ వార్నర్..
మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి వన్డేలో భారత సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ అదరగొట్టారు. జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ కారణంగా కొంత కాలంగా రిజర్వు బెంచ్‌కే పరిమితమవుతూ వస్తున్న మహ్మద్ షమీ... 5 వికెట్లు తీసి అదరగొట్టినా, చెత్త ఫీల్డింగ్‌తో టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మిచెల్ మార్ష్ 4 పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా..
undefined
డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ కలిసి రెండో వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
9వ ఓవర్‌లో డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ని శ్రేయాస్ అయ్యర్ జారవిడిచాడు. ఈ క్యాచ్ అందుకుని ఉంటే, శార్దూల్ ఠాకూర్‌కి మొదటి ఓవర్‌లోనే వికెట్ దక్కేది. 14 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయ్యాడు.
కెఎల్ రాహుల్ ఈజీ రనౌట్‌ని జారవిడిచే సమయానికి మార్నస్ లబుషేన్ 11 పరుగులు మాత్రమే చేశాడు. ఈ రనౌట్ నుంచ తప్పించుకున్న లబుషేన్, 39 పరుగులు చేశాడు...
60 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 41 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్‌ని షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. మార్నస్ లబుషేన్ 49 బంతుల్లో 3 ఫోర్లతో 39 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..
52 బంతుల్లో 3 ఫోర్లతో 31 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్ రనౌట్ అయ్యాడు. 45 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేసిన జోష్ ఇంగ్లీష్, బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు..
మార్కస్ స్టోయినిస్ 21 బంతుల్లో 5 ఫోర్లతో 29 పరుగులు చేయగా మాథ్యూ షార్ట్ 2, సీన్ అబ్బాట్ 2 పరుగులు, ఆడమ్ జంపా 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 9 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.