భార‌త నెంబ‌ర్.1 క్రికెట‌ర్ టెండూల్క‌ర్ కాదు, కోహ్లీ కాదు.. మ‌రి ఇంకెవ్వ‌రు?

By Mahesh Rajamoni  |  First Published Jan 12, 2024, 1:05 PM IST

English cricketer Moeen Ali: జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల‌ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలోనే ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ మొయిన్ అలీ భార‌త్ నుంచి ఐదుగురు అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేశాడు. అయితే, ఇందులో క్రికెట్ గాడ్ స‌చిన్, విరాట్ కోహ్లీల‌లో ఇద్ద‌రికీ నెంబ‌ర్ వ‌న్ ప్లేస్ ద‌క్క‌లేదు ! 
 


India vs England Test series: క్రికెట్ గాడ్ సచిన్‌ టెండూల్కర్‌, ర‌న్ మిష‌న్ విరాట్‌ కోహ్లిలు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లు కానీ, వారిద్ద‌రూ కూడా భారత నంబర్‌ వన్‌ ప్లేయర్‌ కాదని ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ పేర్కొన్నాడు. జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల‌ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలోనే ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ మొయిన్ అలీ భార‌త్ నుంచి ఐదుగురు అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేశాడు. అయితే, ఇందులో క్రికెట్ గాడ్ స‌చిన్, విరాట్ కోహ్లీల‌లో ఇద్ద‌రికీ నెంబ‌ర్ వ‌న్ ప్లేస్ ద‌క్క‌లేదు ! కెప్టెన్‌గా వారు సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకుంటే ఎంఎస్ ధోని టీమిండియా ఆల్ టైమ్ నంబర్ వన్ ప్లేయర్ అని మోయిన్ అలీ అన్నాడు.

ఐదుగురు అత్యుత్తమ భారత ఆటగాళ్లను ఎంపిక చేయమని మొయిన్ అలీని కోర‌గా, మొదటి పేరుగా  ఎంఎస్ ధోనిని ఎంచుకున్నాడు. అలీ జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక క్రికెట్ గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్ కు మొయిన్ అలీ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. భార‌త డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్, సిక్స‌ర్ల వీరుడు యువ‌రాజ్ సింగ్ ల‌కు కూడా మొయిన్ అలీ త‌న టాప్ ఐదు భారతీయ ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ధోని గొప్ప ఆటగాడని పేర్కొన్న అలీ.. ధోని విజయాలను అతని అభిమానులు మరిచిపోతున్నారని అలీ అన్నాడు. కెప్టెన్‌గా ధోనీ అన్నీ సాధించాలనుకున్నాడు. కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఎందుకంటే అతను గొప్ప బ్యాట్స్‌మెన్. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరు. 

Latest Videos

టీ20 క్రికెట్‌లో 100 విజయాలు.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

ఇక స‌చిన్ టెండూల్క‌ర్ కు మూడో ప్లేస్ ఇవ్వ‌డం తనకు బాధ కలిగించిందని చెప్పిన అలీ, అయితే అది సరైనదేనని భావిస్తున్నానని పేర్కొన్నాడు. ఎందుకంటే తాను సచిన్ ఆటతీరును పెద్దగా చూడలేదనీ, త‌న యుగం కంటే ముందు ఆడిన ప్లేయ‌ర్ అని చెప్పాడు. అయిన‌ప్ప‌టికీ స‌చిన్ మరో స్థాయిలో స్టార్ అని అలీ చెప్పాడు. బ్యాటర్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌ అంటే తనకు చాలా ఇష్టమని అలీ అన్నాడు. ఎందుకంటే అత‌ని బ్యాటింగ్ శైలీ అద్భుతంగా ఉంటుంద‌ని చెప్పాడు. టెస్టులైనా, వన్డేలైనా, టీ20లైనా బౌలర్లపై విరుచుకుప‌డ‌తాడ‌ని పేర్కొన్నాడు. అలాగే, తన కెరీర్‌లో ఎవరైనా కాపీ కొట్టేందుకు ప్రయత్నించారంటే అది యువరాజ్ సింగ్ అనీ, ఆ బ్యాట్ స్వింగ్ గేమ్ కూడా ఫామ్ లో ఉంటే యువరాజ్ అత్యుత్తమ ఆటగాడని అలీ పేర్కొన్నాడు. 

శిఖర్ ధావన్, ఎంఎస్ ధోనీలను అధిగమించిన రోహిత్ శ‌ర్మ‌.. !

click me!