బ్రియాన్ లారా కంటే ముందే ఒక మ్యాచ్‌లో 443 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన భారత క్రికెటర్ ఎవ‌రో తెలుసా?

By Mahesh Rajamoni  |  First Published Aug 11, 2024, 11:36 PM IST

Indian cricketer who scored 400+ runs an innings  : గ్రేట్ వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారా అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధికంగా 400 పరుగులు చేసిన ప్రపంచ రికార్డు సృష్టించాడు. అయితే, లారా కంటే ముందే ఒక భార‌త బ్యాట‌ర్ 443 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు.
 


Bhausaheb Nimbalkar : అంత‌ర్జాతీయ క్రికెట్ లో ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ ఏవ‌రు అంటే ముందుగా వినిపించే పేరు బ్రియాన్ లారా. గ్రేట్ వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారా అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక 400 పరుగులు చేసిన ప్రపంచ రికార్డును సృష్టించాడు. అయితే, అత‌ని కంటే ముందే ఒక భార‌త క్రికెట‌ర్ బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. ఒక ఇన్నింగ్స్ లో ఏకంగా 443 పరుగుల చేశాడు. అయితే, ఇక్క‌డ‌ ఒకే ఒక్క తేడా ఏమిటంటే.. ఈ భారత బ్యాట్స్‌మెన్ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కాకుండా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఈ ఘనత సాధించాడు.

క్రికెట్ అభిమానులకు పెద్ద‌గా ఈ భారత క్రికెట‌ర్ గురించి తెలిసివుండ‌క పోవ‌చ్చు. ఎందుకంటే ఈ క్రికెటర్ భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు. భారతదేశం నుండి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 400 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్ ఇత‌నే భౌసాహెబ్ బాబాసాహెబ్ నింబాల్కర్. 2004లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో క్రికెట్ రికార్డుల గురించి మాట్లాడినప్పుడల్లా ఖచ్చితంగా గుర్తుండిపోయేలా లారా ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో 400 అజేయంగా పరుగులు సాధించారు. ఇది టెస్టు చరిత్రలో ఏ బ్యాట్స్‌మెన్ సాధించ‌ని రికార్డు. ప్రపంచంలో మరే క్రికెటర్ టెస్టుల్లో 400 పరుగులు చేయలేకపోయాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో లారా పేరిట రెండో రికార్డు ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతను 1994లో ఒక మ్యాచ్‌లో అజేయంగా 501 పరుగులు చేశాడు.

Latest Videos

undefined

లారా కంటే ముందు అంటే 1948 రంజీ ట్రోఫీలో మహారాష్ట్ర, కతియావర్ జట్లు తలపడ్డాయి. మహారాష్ట్ర తరఫున ఆడిన భౌసాహెబ్ బాబాసాహెబ్ నింబాల్కర్ ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతం చేశాడు. అతను 49 ఫోర్లు, 1 సిక్స్‌తో 443 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో నింబాల్కర్ 494 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు. అతను తప్ప, ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్‌లో ఏ భారత బ్యాట్స్‌మెన్ కూడా 400 పరుగుల ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఫస్ట్ క్లాస్‌లో, ఆస్ట్రేలియన్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మాన్ 452 పరుగుల ప్రపంచ రికార్డ్‌ను బద్దలు కొట్టబోయే స‌మ‌యంలో మ్యాచ్ ముగిసింది. నిం

బాల్కర్ ఆట‌ను చూస్తే బ్రాడ్‌మాన్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టేవాడు, కానీ కతియావార్ కెప్టెన్  విచిత్రమైన డిమాండ్ కారణంగా, మ్యాచ్‌ను ముగించాల్సి వచ్చింది. రాజ్‌కోట్‌కు చెందిన కథియావార్  కెప్టెన్ ఠాకూర్ సాహెబ్ విసుగు చెంది, మహారాష్ట్ర తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాలని అన్నాడు. ఇది జరగకపోతే, అతని బృందం ఇంటికి వెళ్లిపోతుందని తెలిపాడు. దీంతో మహారాష్ట్ర కెప్టెన్ యశ్వంత్ గోఖలే ఆశ్చర్యపోయి, అతడిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. బ్రాడ్‌మాన్ రికార్డును బద్దలు కొట్టడానికి నీల్బ్కర్ చాలా దగ్గరగా ఉన్న స‌మ‌యంలో మ్యాచ్ డిక్లేర్ కార‌ణంగా ఆ రికార్డును కోల్పోయాడు. 

నింబాల్కర్ క్రికెట్ కెరీర్ అద్భుతంగా ఉన్నా అత‌నికి భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం రాలేదు. అతని క్రికెట్ కెరీర్ కేవలం ఫస్ట్ క్లాస్‌కే పరిమితమైంది. నింబాల్కర్ 80 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 118 ఇన్నింగ్స్‌లలో 4841 పరుగులు చేశాడు. 443 పరుగుల అత్యుత్తమ స్కోరుతో 12 సెంచరీలు, 22 అర్ధ సెంచరీలు చేశాడు. అలాగే, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 58 వికెట్లు కూడా తీసుకున్నాడు.


 

click me!