స్టార్ క్రికెటర్ ఇంటిని తగలబెట్టేశారు.. అసలు ఏం జరిగింది?

By Mahesh Rajamoni  |  First Published Aug 6, 2024, 12:07 AM IST

Bangladesh : బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ వ్యతిరేక పోరాటం తీవ్రమైంది. ఈ క్ర‌మంలోనే ఆ దేశాపు ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. అయితే, ఆగ్రహించిన దుండగులు స్టార్ క్రికెటర్ ఇంటిని తగులబెట్టారు. 
 


Bangladesh : బంగ్లాదేశ్ ఆందోళ‌న‌ల‌తో అట్టుడుకుతోంది. రిజర్వేషన్ వ్యతిరేక పోరాటం తీవ్రరూపం దాల్చింది. ఈ రిజర్వేషన్ వ్యతిరేక పోరాటం హింసాత్మకంగా మార‌డంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన రాజీనామా లేఖను విసిరి దేశం విడిచి వెళ్లిపోయారు. అందువల్ల బంగ్లాదేశ్‌లో సైన్యం నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ బహిరంగంగా ప్రకటించారు.

బంగ్లాదేశ్ స్వాతంత్య్ర‌ పోరాటంలో పోరాడిన మాజీ సైనికుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. రెండు నెలల క్రితం పోలీసులు, విద్యార్థుల ఆందోళనకారుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో వందలాది మంది చనిపోయారు. ఇప్పుడు మళ్లీ నిరసనకారులు వీధుల్లోకి రావడంతో హింసాత్మక రూపం దాల్చింది. ధనవంతుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. విలాసవంతమైన జీవితం గడుపుతున్న వారిపై రాళ్ల దాడి జరిగింది.

Latest Videos

undefined

స్టార్ క్రికెటర్ ఇంటికి నిప్పు.. 

ఈ ఆందోళ‌న‌ల మ‌ధ్య బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ మష్రఫే మోర్తజా ఇంటికి కొందరు దుండగులు నిప్పు పెట్టి తగులబెట్టారు. మష్రఫే మొర్తజా ప్రధానమంత్రి షేక్ హసీనాకు మద్దతుదారుడు కాబట్టి ఆయన్ను టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. మొర్తజా ఖుల్నా డివిజన్‌లోని నరైల్-2 నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడు. ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్‌లో జరిగిన సాధారణ ఎన్నికలలో అవామీ లీగ్ అభ్యర్థిగా వరుసగా రెండవసారి గెలిచారు.

మష్రఫే మొర్తజా బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్. అతను తన గొప్ప నాయకత్వం, క్రికెట్ నైపుణ్యాలతో జ‌ట్టుకు అనేక విజ‌యాలు అందించి ప్రసిద్ధి చెందాడు. మొర్తజా తన అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కెరీర్‌ను 2001లో ప్రారంభించాడు. తన ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు అతని సాహసోపేతమైన బ్యాటింగ్ నైపుణ్యాల కారణంగా దృష్టిని ఆకర్షించాడు. 2009లో బంగ్లాదేశ్ వన్డే జట్టుకు మొర్తజా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు. మొర్తజా కెప్టెన్సీలో బంగ్లాదేశ్ జట్టు చాలా ముఖ్యమైన మ్యాచ్‌లను గెలుచుకుంది. 2015 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

click me!