
19వ ఆసియా క్రీడా పోటీల్లో భారత క్రికెట్ జట్లు కూడా బరిలో దిగబోతున్న విషయం తెలిసింది. ఇంతవరకూ ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ టీమ్స్ ఎప్పుడూ పోటీపడింది లేదు. అయితే ఈసారి భారత పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు కూడా ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనబోతోంది.
బీసీసీఐ ఉమెన్స్ విభాగం, ఏషియన్ గేమ్స్ 2023లో పాల్గొనబోయే భారత మహిళా జట్టును ప్రకటించింది. ఆసియా క్రీడల్లో భారత మహిళా జట్టుకి హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరించబోతుంటే, స్మృతి మంధాన వైస్ కెప్టెన్సీ చేస్తుంది..
యంగ్ సెన్సేషనల్ ప్లేయర్లు షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌తో పాటు సీనియర్ బౌలర్ దీప్తి శర్మ, యంగ్ వికెట్ కీపర్ రిచా ఘోష్‌లకు ఆసియా క్రీడల్లో చోటు దక్కింది. రాజేశ్వరి గైక్వాడ్‌తో పాటు అమన్‌జోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి సర్వానీ, తిటాస్ సధు, మిన్ను మని, కనికా అహుజా, అనుషా బారెడ్డి, ఉమా ఛెత్రీలకు తుది జట్టులో చోటు దక్కగా ఆల్‌రౌండర్లు హర్లీన్ డియోల్, స్నేహ్ రాణాలతో పాటు స్టార్ పేసర్ పూజా వస్త్రాకర్ కూడా స్టాండ్ బై ప్లేయర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు..
ఆసియా క్రీడలు 2023 పోటీలకు భారత మహిళా క్రికెట్ జట్టు ఇది:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి సర్వానీ, తిటాస్ సధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మనీ, కనికా అహుజా, ఉమా ఛెత్రీ (వికెట్ కీపర్), అనుషా బారెడ్డి
స్టాండ్‌బై ప్లేయర్లు: హర్లీన్ డియోల్, కేశ్‌వీ గౌతమ్, స్నేహ్ రాణా, సైకా ఇషక్, పూజా వస్త్రాకర్
సెప్టెంబర్ 19 నుంచి 28 వరకూ టీ20 ఫార్మాట్‌లో ఆసియా క్రీడల్లో క్రికెట్ పోటీలు జరగబోతున్నాయి. అక్టోబర్ 5 నుంచి ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభం కాబోతుండడంతో ఆసియా క్రీడలు 2023 పోటీలకు బీ టీమ్‌ని పంపించబోతోంది టీమిండియా..
సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, ఆసియా క్రీడల్లో టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే రుతురాజ్ గైక్వాడ్‌కి కెప్టెన్సీ అప్పగించిన సెలక్టర్లు, ఐపీఎల్‌లో అదరగొట్టిన కుర్రాళ్లతో టీమ్‌ని నింపేశారు..
ఆసియా క్రీడలకు భారత పురుషుల జట్టు ఇది:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, షాబజ్ అహ్మద్, రవి భిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభుసిమ్రాన్ సింగ్
స్టాండ్ బై ప్లేయర్లు: యష్ ఠాకూర్, సాయి కిసోర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్
పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘాన్ వంటి టీమ్స్ కూడా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాల్గొంటున్నాయి. కాబట్టి ఆసియా క్రీడల్లో ఆ జట్లు కూడా బీ టీమ్స్‌తోనే బరిలో దిగబోతున్నాయి.