400 దాటేసిన టీమిండియా... 250 పరుగుల భారీ ఆధిక్యం, కోహ్లీ అవుటైతే డిక్లేర్ చేసే ఆలోచనలో...

Published : Jul 14, 2023, 09:42 PM IST
400 దాటేసిన టీమిండియా... 250 పరుగుల భారీ ఆధిక్యం, కోహ్లీ అవుటైతే డిక్లేర్ చేసే ఆలోచనలో...

సారాంశం

తొలి టెస్టు మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 4 వికెట్ల నష్టానికి 400 పరుగులు చేసిన టీమిండియా... వెస్టిండీస్‌పై ఇప్పటికే 250 పరుగుల ఆధిక్యంలో భారత జట్టు...

డొమినికా టెస్టులో మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 4 వికెట్ల నష్టానికి సరిగ్గా 400 పరుగుల స్కోరు చేసింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకి ఆలౌట్ అయిన ఆతిథ్య వెస్టిండీస్‌పై ఇప్పటికే 250 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, మరో సెషన్‌ బ్యాటింగ్ చేసి... ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశం ఉంది.

ఓవర్‌నైట్ స్కోరు 312/2 వద్ద మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, మొదటి అరగంటలో వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. మొట్టమొదటి టెస్టు మ్యాచ్ ఆడుతున్న యశస్వి జైస్వాల్, 387 బంతుల్లో 16 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 171 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఐపీఎల్ 2023, ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో మంచి పర్పామెన్స్ ఇచ్చిన అజింకా రహానే, అదే ఫామ్‌ని కంటిన్యూ చేయలేకపోయాడు..

11 బంతుల్లో 3 పరుగులు చేసిన అజింకా రహానే, కీమర్ రోచ్ బౌలింగ్‌లో బ్లాక్‌వుడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 147 బంతుల్లో 2 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, అర్ధ శతకం అందుకున్న తర్వాత కాస్త దూకుడు పెంచాడు. లంచ్ బ్రేక్ సమయానికి 170 బంతుల్లో 5 ఫోర్లతో 72 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాతో కలిసి 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు..

రవీంద్ర జడేజా 52 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసి, కోహ్లీతో కలిసి క్రీజులో ఉన్నాడు. విరాట్ కోహ్లీ సెంచరీకి చేరువవుతుండడంతో టీమిండియా, రెండో సెషన్ ముగిసిన తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే 250 పరుగుల ఆధిక్యం దక్కడంతో విరాట్ కోహ్లీ వికెట్ పడితే ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తారా? లేక ఆరంగ్రేటం టెస్టు ఆడుతున్న ఇషాన్ కిషన్‌కి బ్యాటింగ్ చేసే అవకాశం ఇస్తారా? అనేది చూడాలి.. 

ఆరంగ్రేటం టెస్టులో అత్యధిక స్కోరు బాదిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు యశస్వి జైస్వాల్.. ఇంతకుముందు శిఖర్ ధావన్, ఆరంగ్రేటం టెస్టులో 187 పరుగులు చేయగా, రోహిత్ శర్మ తన తొలి టెస్టులో 177 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ రికార్డుకి 6 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు యశస్వి జైస్వాల్.. అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జోషువా డి సిల్వకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు జైస్వాల్..

రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్‌కి 229 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కి 110 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. తన ఇన్నింగ్స్‌లో 387 బంతులు ఫేస్ చేసి, ఆరంగ్రేటం టెస్టులో అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారత బ్యాటర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు యశస్వి జైస్వాల్..

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !