T20 World Cup: నువ్వు కాకుంటే నాకు చాలా మంది వికెట్ కీపర్లున్నారు.. రిషభ్ పంత్ కు విరాట్ కోహ్లి వార్నింగ్

Published : Oct 15, 2021, 06:11 PM ISTUpdated : Oct 15, 2021, 06:17 PM IST
T20 World Cup: నువ్వు కాకుంటే నాకు చాలా మంది వికెట్ కీపర్లున్నారు.. రిషభ్ పంత్ కు విరాట్ కోహ్లి  వార్నింగ్

సారాంశం

ICC T20 World Cup: మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కు ముందు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి.. వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. పంత్ సరిగ్గా ఆడకుంటే తనకింకా చాలా మంది వికెట్ కీపర్లున్నారని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. 

ఈనెల 17 నుంచి యూఏఈ వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 World Cup) మొదలుకానుంది.  ఈ టోర్నీలో భారత్.. 24 నుంచి కప్ వేటను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో  భారత  సారథి విరాట్ కోహ్లి (Virat Kohli).. వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) కు వార్నింగ్ ఇచ్చాడు. మ్యాచ్ లు గెలవాలంటే ఫినిషర్ గా ఉండే పంత్  వంటి వాళ్లు సిక్సర్లు కొట్టాలని సూచించాడు.

టీ20 క్రికెట్ లో సిక్సర్లు కొట్టే వాళ్లే మ్యాచ్ లు ముగుస్తారని కోహ్లి.. పంత్ కు సూచించాడు. ధనాధన్ బ్యాటింగ్ తో జట్టు కు విజయాలు అందించాలని కోరాడు. లేకుంటే తనకు చాలా మంది వికెట్ కీపర్లున్నారని హెచ్చరించాడు. దీనికి స్పందించిన పంత్ కూడా.. దానికి తగ్గట్టే తాను సన్నద్ధమవుతున్నానని కోహ్లికి చెప్పాడు. 

ఇది కూడా చదవండి: భారత్-పాక్ అభిమానులను ఉర్రూతలూగించే ‘మోకా మోకా’ యాడ్ మళ్లీ వచ్చేసింది.. ఐసీసీ టోర్నీల్లో దీని క్రేజే వేరప్పా..

అసలేం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ (Star sports Add) రూపొందించిన ఓ యాడ్ లో కోహ్లి, పంత్ లు  ఇలా మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు  సోషల్ మీడియా (Social Media)లో వైరల్ గా మారింది. ఈ యాడ్ లో కోహ్లి, పంత్ వీడియో కాల్ లో ముచ్చటించుకున్నారు. ఆ సంభాషణ ఇలా.. 

కోహ్లి:  పంత్.. టీ20లలో సిక్సర్లే మ్యాచ్ లను గెలిపిస్తాయి. 
పంత్: నువ్వేం కంగారుపడకు భయ్యా.. నేను రోజు ప్రాక్టీస్ చేస్తున్నా. ఇంతకుముందు వికెట్ కీపర్ గా ఉన్న వ్యక్తే టీమ్ ఇండియాకు సిక్సర్ కొట్టి ప్రపంచకప్ అందించాడు. (2011 ప్రపంచకప్ లో శ్రీలంకపై ధోని కొట్టిన సిక్సర్ ను ఉద్దేశిస్తూ.. ) 
కోహ్లి: నిజమే.. కానీ ధోని భాయ్ తర్వాత అంతటి వికెట్ కీపర్ భారత్ కు ఇంకా దొరకలేదు. 
పంత్: నేనూ టీమిండియా కీపరే కదా.. 
కోహ్లి: చూడు పంత్.. నాకు చాలా మంది కీపర్లున్నారు. వార్మప్ మ్యాచుల్లో ఎవరెలా ఆడుతారో చూద్దాం.. అంటూ ఇద్దరూ సరదాగా సంభాషించుకున్నారు. ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి మరి.. 

 

భారత్ అధికారిక షెడ్యూల్ 24 నుంచి మొదలుకానున్నా.. అంతకంటే ముందే 18న ఇంగ్లండ్ తో 20న  ఆస్ట్రేలియాతో తలపడనుంది. పాక్ తో జరుగబోయే మెగా ఈవెంట్ ను ఎక్కువ మంది చూసేందుకు స్టార్ స్పోర్ట్స్ సంస్థ విభిన్న రీతిలో యాడ్ లను రూపొందిస్తున్నది. ఇప్పటికే ‘మోకా మోకా’ యాడ్ కూడా  సంచలనం సృష్టిస్తున్నది. 

PREV
click me!

Recommended Stories

IND vs NZ : అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్ ఇదే.. ఇండియా-న్యూజిలాండ్ ఫైనల్ ఎలా సాగనుంది..?
T20 World Cup ఫైనల్‌లో అభిషేక్ శర్మను ఆడిస్తారా? గంభీర్, సూర్యల ప్లానేంటి?